జగన్ మావాడే, ఎన్నడూ ద్వేషించలేదు: జేసీ దివాకర్ రెడ్డి

Published : Jun 03, 2019, 02:27 PM ISTUpdated : Jun 03, 2019, 02:38 PM IST
జగన్ మావాడే, ఎన్నడూ ద్వేషించలేదు: జేసీ దివాకర్ రెడ్డి

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తాను రాజకీయ విమర్శలు చేశానని.... కానీ, జగన్‌ను ఏనాడూ కూడ ద్వేషించలేదని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.  

అనంతపురం: ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై తాను రాజకీయ విమర్శలు చేశానని.... కానీ, జగన్‌ను ఏనాడూ కూడ ద్వేషించలేదని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.

సోమవారం నాడు జేసీ దివాకర్ రెడ్డి ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడారు. తాను రాజకీయాల నుండి తప్పుకొంటున్నట్టుగా ఆయన ప్రకటించారు.  జగన్ మా వాడేనని ఆయన ప్రకటించారు. అయితే తాను పార్టీ మారాలనుకోవడం లేదన్నారు.

ప్రధానమంత్రి మోడీతో జగన్ వ్యవహరిస్తున్న తీరును జేసీ దివాకర్ రెడ్డి ప్రశంసించారు. ఈ తీరుతో  ఏపీలో శుభపరిణామంగా ఆయన ప్రకటించారు. గత ఐదేళ్ల కాలంలో వైసీపీ‌ చీఫ్ వైఎస్ జగన్‌పై  జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం... దివాకర్ రెడ్డి కుటుంసభ్యులు ఇద్దరూ కూడ ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.ఈ తరుణంలో జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకొన్నాయి.

PREV
click me!

Recommended Stories

రూ. 15వేల కోట్ల పెట్టుబ‌డి, 45 వేల‌కిపై ఉద్యోగాలు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో దిగ్గజ సంస్థ
Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet Telugu