జగన్ సమీక్ష: ఎన్టీఆర్ వైద్య సేవ ఇక నుండి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ

By narsimha lodeFirst Published Jun 3, 2019, 2:12 PM IST
Highlights

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు.   ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో కొనసాగుతున్న పథకం పేరును వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ గా మార్చే అవకాశం ఉంది. 

అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు.   ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో కొనసాగుతున్న పథకం పేరును వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ గా మార్చే అవకాశం ఉంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

అమరావతిలో ఏపీ సీఎం వైఎస్ జగన్ వైద్య, ఆరోగ్య శాఖపై తాడేపల్లిని  తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.  ఈ సమీక్షకు సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పీవీ రమేష్, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.

 రాష్ట్రంలో వైద్య రంగంలో అనుసరిస్తున్న సంస్కరణలపై అధికారులతో చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు... మౌళిక వసతులపై జగన్ ఆరా తీశారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై  జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వైద్య, ఆరోగ్య శాఖలో సంస్కరణలు తీసుకురావాలని జగన్ ఆదేశించారు.

ఎన్నికల సమయంలో వెయ్యి రూపాయాల కంటే  ఒక్క పైసా ఎక్కువ ఖర్చు అయినా కూడ ప్రభుత్వమే భరించనుందని జగన్ హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేసేందుకు గాను జగన్ ప్లాన్ చేస్తున్నారు.  వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీలో ఎన్నికల్లో హామీలను అమలు చేసే విధంగా పథకాన్ని రూప కల్పన చేయనున్నారు.


 

click me!