ఎన్నికల సీజన్ : ఏపీకి క్యూ కడుతోన్న బీజేపీ అగ్రనేతలు.. విశాఖకి అమిత్ షా, తిరుపతికి నడ్డా

By Siva KodatiFirst Published Jun 2, 2023, 3:42 PM IST
Highlights

ఎన్నికల సీజన్ కావడంతో బీజేపీ నేతలు ఏపీకి క్యూకడుతున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖకు , బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 10న తిరుపతికి రానున్నారు.

మరో ఏడాదిలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ రాష్ట్రంపై ఫోకస్ పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో బలం లేనప్పటికీ.. తన ప్రయత్నాలు తాను చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా కమల నాథులతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తోంది. కానీ ఇంకా అటు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. 

ఇదిలావుండగా.. ఎన్నికల సీజన్ కావడంతో బీజేపీ నేతలు ఏపీకి క్యూకడుతున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖకు రానున్నారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గని బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 10న తిరుపతికి రానున్నారు. ప్రధాని మోడీ తొమ్మిదేళ్ల పాలనపై ఆయన వివరించనున్నారు. 

ALso Read: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీతోనే జనసేన , మా హైకమాండ్‌తో పవన్ మాట్లాడారు : సుజనా చౌదరి

మరోవైపు.. టీడీపీ - జనసేనల మధ్య దాదాపుగా పొత్తు ఖరారు అయ్యిందని విశ్లేషకులు అంటున్నారు. తేలాల్సింది సీట్ల పంపకమేనని వారు చెబుతున్నారు. పవన్ కానీ, ఇతర జనసేన నేతలు కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్పడం దీనికి బలాన్ని చేకూరుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి పార్టీ పెద్దలతో పవన్ కల్యాణ్ చర్చలు జరిపారని అన్నారు. 

ఇరు పార్టీలు పొత్తులతోనే ముందుకు సాగుతాయని ఆయన పేర్కొన్నారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి వుంటామని.. ఏపీకి కేంద్రం సాయం చేసిందని సుజనా చౌదరి వెల్లడించారు. మోడీ నిధులు ఇచ్చినా మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటున్నాని ఆయన దుయ్యబట్టారు. విభజన చట్టం ప్రకారం.. ఏపీకి ఎయిమ్స్, కేంద్ర విద్యా సంస్థలు, జాతీయ రహదారులు మంజూరు చేసినట్లు సుజనా చౌదరి పేర్కొన్నారు. 

click me!