తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం: తప్పిన ప్రమాదం, భక్తులు సురక్షితం

By narsimha lode  |  First Published Jun 2, 2023, 3:26 PM IST

తిరుమల ఘాట్  రోడ్డులో  ఇవాళ  ప్రమాదం  చోటు  చేసుకుంది.  కారు అదుపు తప్పి  రెయిలింగ్  ను ఢీకొట్టి నిలిచిపోయింది. 



తిరుపతి: తిరుమల  ఘాట్  రోడ్డులో  శుక్రవారంనాడు  రోడ్డు ప్రమాదం  జరిగింది. ఈ ప్రమాదంలో  తెలంగాణ రాష్ట్రానికి  చెందిన వారు స్వల్ప గాయాలతో  బయటపడ్డారు.తిరుమల వెంకన్న దర్శనానికి  తెలంగాణకు  చెందిన భక్తులు  వెళ్లారు. వెంకన్న దర్శనం  చేసుకొని శుక్రవారంనాడు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే  తిరుమల ఘాట్  రోడ్డు చివరి మలుపు వద్ద కారు  రెయిలింంగ్ ను ఢీకొని  కారు నిలిచిపోయింది.  అయితే  కారులో  ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో  పెద్ద  ప్రమాదం  తప్పింది.  తిరుమల  ఘాట్  రోడ్డులో  ఇటీవల  కాలంలో  ప్రమాదాలు  ఎక్కువౌతున్నాయి. 

ఈ ఏడాది మే   24న  28వ  మలుపు వద్ద  ప్రమాదం  జరిగింది.  ఈ ప్రమాదంలో  ఆరుగురు  ప్రయాణీకులు గాయపడ్డారు.   మే  29న  తిరుమల ఘాట్  రోడ్డు ఆరో మలుపు వద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  15 మంది కర్ణాటక  రాష్ట్రానికి చెందిన భక్తులు గాయపడ్డారు.

Latest Videos

undefined

also read:తిరుమల ఘాట్ రోడ్డు: 12 ఏళ్లు దాటిన వాహనాలకు నో ఎంట్రీ

దీంతో  తిరుమల ఘాట్  రోడ్డులో ప్రమాదాల నివారణకు  టీటీడీ  చర్యలు తీసుకుంటుంది.   ఈ క్రమంలో   నిరంతరం ఘాట్ రోడ్డులో   పర్యవేక్షించాలని ఇటీవలనే  నిర్ణయం తీసుకున్నారు. మరో వైపు ఘాట్ రోడ్డులో  12 ఏళ్లు దాటిన వాహనాలను  అనుమతించవద్దని  కూడా టీటీడీ  నిర్ణయం తీసుకుంది.  వాహన ప్రమాదాలు  జరిగేందుు  అవకాశం ఉన్న ప్రదేశాల్లో  జాగ్రత్తలు  తీసుకుంటున్నారు

click me!