కాకినాడ జేఎన్‌టీయూలో ఎంబీఏ విద్యార్ధినికి వేధింపులు: కాంట్రాక్టు లెక్చరర్‌పై వేటు

By narsimha lode  |  First Published Dec 1, 2022, 9:27 PM IST

కాకినాడ జేఎన్‌టీయూలో  ఎంబీఏ సెకండియర్ చదువుతున్న విద్యార్ధినిపై  కాంట్రాక్టు లెక్చరర్  వేధింపులకు పాల్పడ్డాడు. ఈ  వేధింపులపై బబాధితురాలు  ఫిర్యాదు  చేసింది. లెక్చరర్ పై యూనివర్శిటీ అధికారులు వేటేశారు. 


విజయవాడ: కాకినాడ జెఎన్‌టీయూలో  ఎంబీఏ సెకండియర్  చదువుతున్న విద్యార్ధినిపై కాంట్రాక్ట్  లెక్చరర్  కుమార్  వేధింపులకు పాల్పడ్డాడు.ఈ  వేధింపులపై  బాధిత విద్యార్ధిని  ఫిర్యాదు  చేసింది.ఈ  ఫిర్యాదు  ఆధారంగా  కాంట్రాక్టు లెక్చరర్  కుమార్ ను విధుల నుండి తప్పించారు.  ఈ విషయమై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు యూనివర్శిటీ అధికారులు.

ఎంబీఏ రెండో  సంవత్సరం చదువుతున్న విద్యార్ధినిని   కాంట్రాక్టు లెక్చరర్  వేధింపులకు గురి చేస్తున్నారని  యూనివర్శిటీ వీసీకి  బాధితురాలు ఫిర్యాదు  చేసింది.ఈ వేధింపులకు సంబంధించి  బాధితురాలు కొన్ని ఆధారాలను  కూడా  పంపింది.ఈ  విషయమై  విచారణ నిర్వహించిన  యూనివర్శిటీ అధికారులు కాంట్రాక్టు లెక్చరర్  కుమార్ ను డిస్మిస్  చేశారు. అంతేకాదు  బాధితురాలి నుండి  ఈ విషయమై  అదికారులు మరింత సమాచారం తెలుసుకోనున్నారు.

Latest Videos

గతంలో  కాకినాడ జేఎన్‌టీయూ లో  ఎంటెక్  ఫస్టియర్ విద్యార్ధినిపై అసిస్టెంట్ ప్రొఫెసర్  లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై  యూనివర్శిటీ అధికారులు  కమిటీని ఏర్పాటు చేశారు.   లాబోరేటరీలో  అసిస్టెంట్  ప్రొఫెసర్  తనను అసభ్యంగా తాకారని  ఆమె ఆరోపించింది. 
 

click me!