మంత్రి గుమ్మనూరు జయరాం భార్యకు ఐటీ నోటీసులు.. ఆయన ఏమన్నారంటే..

By Sumanth KanukulaFirst Published Dec 1, 2022, 3:46 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మకు ఐటీ అధికారులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. బినామీ యాక్టు కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన మంత్రి జయరాం.. తన భార్యకు ఎలాంటి ఐటీ నోటీసులు రాలేదని  తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మకు ఐటీ అధికారులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. కర్నూలు జిల్లా అస్పరిలో కొనుగోలు చేసిన 30.83 ఎకరాల భూమి కొనుగోలు లావాదేవీలపై నోటీసులు పంపారు. బినామీ యాక్టు కింద ఈ నోటీసులు జారీ అయ్యాయి. అయితే ఈ వార్తలపై స్పందించిన మంత్రి జయరాం.. తన భార్యకు ఎలాంటి ఐటీ నోటీసులు రాలేదని  తెలిపారు. తాము చట్టబద్దంగానే భూములు కొనుగోలు చేశామని చెప్పారు. ఇట్టినా కంపెనీ నుంచి తాము భూములు కొనుగోలు చేయలేదని తెలిపారు. రైతులు బీడు పెట్టుకున్న భూమి అమ్మితే కొన్నానని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. పొలం కొనుగోలు చేసింది బినామీలు కాదని తమ కుటుంబ సభ్యులేనని తెలిపారు. తమది ఉమ్మడి  కుటుంబం అని చెప్పారు. 

అయితే కొద్ది రోజుల క్రితమే గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మకు ఐటీ అధికారులు నోటీసులు జారీచేసినట్టుగా తెలుస్తోంది.  రూ. 52 లక్షల విలువైన భూ కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలు చూపడం లేదని నోటీసులు పేర్కొన్నారు. భూ కొనుగోళ్ల లావాదేవీలకు సంబంధించిన ఇన్‌కమ్ అందివ్వాలని చెప్పారు. 90 రోజుల్లో వివరాలు అందివ్వాలని తెలిపారు. మొత్తం 180 ఎకరాల భూమి కొనుగోలు జరిగిందని.. అందులో రేణుకమ్మ పేరు మీద 30.83 ఎకరాలున్నట్టు ఐటీ నోటీసులు పేర్కొన్నారు. గతంలో ఇదే భూముల విషయంలో గుమ్మనూరు జయరాంపై ఆరోపణలు వచ్చాయి. 

click me!