జిన్నా టవర్‌పై మళ్లీ రాజుకున్న వివాదం.. జాతీయ జెండా ఎగురవేతకు హిందూ వాహిని యత్నం, ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Jan 26, 2022, 3:12 PM IST
Highlights

జిన్నా టవర్ పై జాతీయ జెండా(National Flag) ఎగురవేస్తామని హిందూ వాహిని ప్రకటించడంతో నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అన్నట్టుగానే జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగరేసేందుకు ప్రయత్నించారు హిందూ వాహినీ కార్యకర్తలు. 

కొద్దిరోజుల క్రితం గుంటూరులోని (guntur) ప్రముఖ కట్టడం జిన్నా టవర్‌పై (jinnah tower) పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. దేశ విభజనకు, లక్షల మంది చావుకు కారణమైన వ్యక్తి పేరు భారత్‌లో వుండటానికి వీల్లేదంటూ బీజేపీ  నేతలు ఆందోళనకు దిగారు. 75 ఏళ్ల తర్వాత కూడా ఓ దేశద్రోహి పేరుతో సెంటర్‌ ఉండటం దేశానికే అవమానమంటున్నారు బీజేపీ నేతలు. దాని పేరు మార్చాలనీ.. లేకపోతే కూల్చేస్తామని హెచ్చరించారు. 

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ (satya kumar) .. జిన్నా టవర్‌పై పెట్టిన ట్వీట్‌.. ఈ రచ్చకు కారణమైంది.  ఆ తర్వాత తెలంగాణ బీజేపీ నేత, గోషా మహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ (raja singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే జిన్నా సెంటర్‌ పేరు మార్చాలని డిమాండ్‌ చేసిన రాజాసింగ్‌.. ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ కార్యకర్తలు జిన్నా టవర్‌ను కూలగొట్టాలంటూ పిలుపునిచ్చారు. వెంటనే జిన్నా టవర్ పేరును తొలిగించి స్వాతంత్య్ర యోధుల పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

తర్వాత సద్దుమణిగిన ఈ విషయం రిపబ్లిక్ డే (republi day) సందర్భంగా మరోసారి ప్రస్తావనకు వచ్చింది. జిన్నా టవర్ పై జాతీయ జెండా(National Flag) ఎగురవేస్తామని హిందూ వాహిని ప్రకటించడంతో నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అన్నట్టుగానే జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగరేసేందుకు ప్రయత్నించారు హిందూ వాహినీ కార్యకర్తలు. అయితే వీరి ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. టవర్‌వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించినవారిని.. అరెస్ట్‌ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో, టవర్‌ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టవర్ వైపు  ఎవర్నీ రానీయకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. 

click me!