AP New Districts: అప్పటివరకు కొత్త జిల్లాలపై అభ్యంతరాల స్వీకరణ.. మంత్రి ధర్మాన కృష్ణదాస్

By Sumanth KanukulaFirst Published Jan 26, 2022, 12:22 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను  ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉగాది నాటికి కొత్త జిల్లాల (AP New Districts) నుంచి పాలన చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. అంతకు ముందు మంగళవారం కొత్త జిల్లాలకు సంబంధించిన ప్రతిపాదనలను మంత్రులందరికీ పంపి ఆ తర్వాత ఆన్‌లైన్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి పాలన చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయాలన్న ప్రతిపాదనకు లోబడుతూనే…  భౌగోళిక,  సామాజిక,  సాంస్కృతిక  పరిస్థితుల్ని,  సౌలభ్యాలను  దృష్టిలో ఉంచుకుని  కొత్త జిల్లాల సరిహద్దులు నిర్ణయించడంలో ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది.

అయితే కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన అభ్యంతరాలు ఉంటే వచ్చే నెల 26 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టుగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీని అమలు చేస్తూ కొత్తగా 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. రిపాలన సౌలభ్యం, సత్వర సేవలే లక్ష్యంగా కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టినట్టుగా వివరించారు. 

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే వచ్చే నెల 26వ తేదీ వరకు స్వీకరిస్తామని మంత్రి పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ప్రజాప్రతి నిధులు అందరూ కోరుకున్నట్లుగానే ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని జిల్లాలోనే కొనసాగించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు. అతి ముఖ్యమైన రూరల్ యూనివర్సిటీ, పారిశ్రామిక వాడ శ్రీకాకుళం జిల్లాలోనే ఉంటాయని మంత్రి ధర్మనా కృష్ణదాస్‌ చెప్పారు.

కొత్తగా ఏర్పాటైన జిల్లాల వివరాలు ఇవే.. 
జిల్లా పేరు                                  జిల్లా కేంద్రం
శ్రీకాకుళం                                    శ్రీకాకుళం
విజయనగరం                              విజయనగరం
మన్యం జిల్లా                                పార్వతీపురం
అల్లూరి సీతారామరాజు జిల్లా        పాడేరు
విశాఖపట్నం                               విశాఖపట్నం
అనకాపల్లి                                    అనకాపల్లి 
తూర్పుగోదావరి                            కాకినాడ
కోనసీమ                                       అమలాపురం
రాజమహేంద్రవరం                      రాజమహేంద్రవరం
నరసాపురం                                 భీమవరం
పశ్చిమగోదావరి                            ఏలూరు
కృష్ణా                                           మచిలీపట్నం
ఎన్టీఆర్ జిల్లా                               విజయవాడ
గుంటూరు                                    గుంటూరు
బాపట్ల                                          బాపట్ల
పల్నాడు                                     నరసరావుపేట
ప్రకాశం                                       ఒంగోలు
ఎస్ పీఎస్ నెల్లూరు                     నెల్లూరు
కర్నులు                                     కర్నూలు
నంద్యాల                                    నంద్యాల
అనంతపురం                             అనంతపురం
శ్రీసత్యసాయి జిల్లా                     పుట్టపర్తి
వెఎస్సార్ కడప                          కడప
అన్నమయ్య జిల్లా                     రాయచోటి
చిత్తూరు                                     చిత్తూరు
శ్రీబాలాజీ జిల్లా                          తిరుపతి

click me!