జగన్ ఎప్పటికీ సిఎం కాలేడు...

Published : Sep 29, 2017, 01:21 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
జగన్ ఎప్పటికీ సిఎం కాలేడు...

సారాంశం

‘‘వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు’’....ఇది తాజాగా అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు.

‘‘వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేడు’’....ఇది తాజాగా అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ‘జగన్ నవరత్నాలు లేవు...నాపరాళ్ళు లేవు’ అంటూ ఎద్దేవా చేసారు. రాజకీయాల నుండి తప్పుకుంటే మంచిదంటూ జగన్ కు జెసి ఓ ఉచిత సలహా కూడా పడేసారు. ప్రజలు జగన్ ను నమ్మడం లేదని కూడా అన్నారు. తొలిసారి సిఎం అయ్యే అవకాశాన్ని జగన్ పోయిన ఎన్నికల్లోనే చేజార్చుకున్నట్లు జెసి అభిప్రాయపడ్డారు. పాదయాత్ర గురించి మాట్లాడుతూ, ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిన వ్యక్తి పాదయాత్రను ఎలా చేస్తారంటూ ప్రశ్నించారు. చివరగా తన రాజీనామా గురించి మాట్లాడుతూ, అనంతపురం ప్రజల కష్టాలను తీరుస్తానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు కాబట్టే తన రాజీనామా ప్రకటనను వాపసు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసారు.

PREV
click me!

Recommended Stories

Spectacular Drone Show in Arasavalli మోదీ, చంద్రబాబు చిత్రాలతో అదరగొట్టిన డ్రోన్ షో | Asianet Telugu
Minister Atchannaidu: అరసవల్లిలో ఆదిత్యుని శోభాయాత్రను ప్రారంభించిన అచ్చెన్నాయుడు| Asianet Telugu