మేం పోటీలో లేకుంటే.. వైసీపీకి రూపాయి ఖర్చుండదు: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Apr 03, 2021, 04:14 PM IST
మేం పోటీలో లేకుంటే.. వైసీపీకి రూపాయి ఖర్చుండదు: జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్నయంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్నయంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే జ్యోతుల నెహ్రూ, అశోక్ గజపతి రాజు వంటి సీనియర్లు ధిక్కార స్వరం వినిపించారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు.

అధిష్టానం ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మేం పోటీలో లేకుంటే పోలీసులకు వన్‌సైడ్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పని వుండదంటూ ఎద్దేవా చేశారు.

Also Read:పరిషత్ ఎన్నికలు: చంద్రబాబు నిర్ణయానికి అడ్డం తిరుగుతున్న టీడీపీ నేతలు

టీడీపీ నిర్ణయంతో వైసీపీ అభ్యర్ధుల్లో సంతోషం నెలకొందని జేసీ అన్నారు. రూపాయి ఖర్చు లేకుండా వైసీపీ అభ్యర్ధులు గెలుస్తారంటూ ప్రభాకర్ రెడ్డి సెటైర్లు వేశారు.

పార్టీ సింబల్‌పై జరిగే ఎన్నికలు కాబట్టి ప్రజలు ఓటింగ్‌కు వెళ్తారని చెప్పారు. ఎన్నికల బహిష్కరణ నిర్ణయంతో కార్యకర్తలు నిరుత్సాహంగా వున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు