ఇది విరుద్ధం: జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన సోము వీర్రాజు

By telugu teamFirst Published Apr 3, 2021, 3:14 PM IST
Highlights

పరిషత్ ఎన్నికలు జరుగుతుండగా గ్రామ సర్పంచులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఎన్నికల కోడ్ కు విరుద్ధమని బిజెపి ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు దీనిపై ఆయన ప్ఱభుత్వాన్ని తప్పు పట్టారు.

అమరావతి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ తీరుపై బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు విమ‌ర్శ‌లు గుప్పించారు. 'రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్ల తేదీల‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేప‌థ్యంలో గ్రామాల్లో, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండ‌గా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను, పంచాయతీ బోర్డు మెంబర్లను ప్రమాణస్వీకారం చేయించడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని సోము వీర్రాజు చెప్పారు.
 
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా పంచాయతీ పాలకవర్గ సమావేశం, సర్పంచుల పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం 3వ తేదీన ఏ విధంగా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించారు. పంచాయతీ కార్యవర్గ పదవీ బాధ్యతలు స్వీకరణ కార్యక్రమం 3వ తేదీన ఏర్పాటు చేసి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్ కి ముందుగానే నోటిఫికేషన్ ఏవిధంగా జారీ చేస్తారని సోము వీర్రాజు అడిగారు. 

ఇది కోడ్ ఉల్లంఘన కాదా? ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి ఇది ఒక ఉదాహరణ అని విమర్శించారు. ఈ సందర్భంలో రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశం కానీ నిర్వర్తించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని అన్నారు. 

వెంటనే నిలుపుదల చేయాలని పంచాయతీరాజ్ కమిషనర్ ని బీజేపీ ఏపీ శాఖ‌ డిమాండ్ చేస్తుందని సోము వీర్రాజు ట్వీట్లు చేశారు.

click me!