అనంతపురం ఉల్లికల్లు ఇసుకరీచ్ వద్ద జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నా: ఉద్రిక్తత, అరెస్టు

By narsimha lodeFirst Published Feb 9, 2023, 1:24 PM IST
Highlights

అనంతపురం జిల్లాలోని  ఉల్లికల్లు ఇసుక రీచ్ వద్ద  మాజీ ఎమ్మెల్యే  జేసీ ప్రభాకర్ రెడ్డి  ఇవాళ ఆందోళనకు దిగారు. 
 

అనంతపురం: జిల్లాలోని  ఉల్లికల్లు ఇసుక రీచ్  వద్ద  తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి  గురువారం నాడు  ఆందోళనకు దిగారు . అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్నారని  జేసీ ప్రభాకర్ రెడ్డి  ఆరోపించారు.  రైతులతో  కలిసి    జేసీ ప్రభాకర్ రెడ్డి   ధర్నా నిర్వహించారు.  అయితే  ధర్నాకు  అనుమతి లేదని  ఆయనను  పోలీసులు అరెస్ట్  చేశారు. 

అనుమతి లేకుండా  ఉల్లికల్లు ఇసుక రీచ్ నుండి  ఇసుకను తరలిస్తున్నవారిపై కేసు నమోదు చేయాలని   జేసీ ప్రభాకర్ రెడ్డి  డిమాండ్  చేశారు.  ఉల్లికల్లు  ఇసుక రీచ్ వద్ద  రోడ్డుపై  బైఠాయించిన   జేసీ ప్రభాకర్ రెడ్డిని  పోలీసులు అరెస్ట్  చేశారు.  ఉల్లికల్లు   ఇసుక రీచ్ కు అనుమతి  ఉంటే  అనుమతి పత్రాలు చూపాలని  జేసీ ప్రభాకర్ రెడ్డి  డిమాండ్  చేశారు.  ఈ ఇసుక రీచ్   కి అనుమతి ఉందని  మైన్స్  అధికారులు, తహసీల్దార్   పత్రాలుచూపాలని ఆయన కోరారు. 

ధర్నాకు దిగిన జేసీ ప్రభాకర్ రెడ్డిని  పోలీసులు అరెస్ట్  చేసి  పెద్దపప్పూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీస్ స్టేషన్ కు తరలించే సమయంలో  పోలీసులతో  జేసీ ప్రభాకర్ రెడ్డి  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 

 

click me!