నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంద్రబాబు ట్యాపింగ్ చేశారని ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.
నెల్లూరు: ఫోన్ ట్యాపింగ్ జరగలేదని మ్యాన్ ట్యాపింగ్ జరిగిందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు.గురువారం నాడు నెల్లూరులో ఏపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోపించినట్టుగా ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారు. చంద్రబాబునాయుడు శ్రీధర్ రెడ్డిని ట్యాపింగ్ చేశారన్నారు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన భవిష్యత్తును నాశనం చేసుకున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్ధులు విజయం సాధిస్తారని మంత్రి గోవర్ధన్ రెడ్డి ధీమాను వ్యక్తం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ విషయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి చేసినవన్నీ అవాస్తవాలని తేలిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి చెప్పిన విషయాన్ని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కాదు, ఇది ఫోన్ రికార్డింగ్ అనే విషయం శ్రీధర్ రెడ్డి అంతరాత్మకు తెలుసునని కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ జరగకున్నా జరిగినట్టుగా చిత్రీకరించేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు. ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.
undefined
also read:వైసీపీ నుండి మళ్లీ పోటీ చేయను, ఆర్నెళ్లలో చిత్ర విచిత్రాలు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జాతకాన్ని బయటపెడతామని ఎంపీ అదాల ప్రభాకర్ రెడ్డి చెప్పారు. అబద్దాలు, నాటకాలు ఆడడం మానుకోవాలని ఆదాల ప్రభాకర్ రెడ్డి హితవు పలికారు.