ఏపీ, తెలంగాణలో 15 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల షెడ్యూల్ విడుదల: మార్చి 13న పోలింగ్

By narsimha lode  |  First Published Feb 9, 2023, 12:28 PM IST

ఏపీ రాష్ట్రంలో  ఐదు ఎమ్మెల్సీ  స్థానాలకు  ఈసీ  షెడ్యూల్ ను ఇవాళ విడుదల చేసింది.  
 



న్యూఢిల్లీ: న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  మూడు  గ్రాడ్యుయేట్ , రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు  ఈసీ  షెడ్యూల్  ను ప్రకటించింది.  మరో వైపు  ఎనిమిది స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ  స్థానాలకు  కూడా  షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలోని    స్థానిక సంస్థల, టీచర్స్  ఎమ్మెల్సీ  స్థానానికి  షెడ్యూల్ విడుదల చేసింది  ఈసీ.  రెండు రాష్ట్రాల్లోని  మొత్తం  15  ఎమ్మెల్సీ స్థానాలకు  పోలింగ్  నిర్వహించనుంది ఈసీ.

 ఈ నెల  16వ తేదీన  నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి  13న పోలింగ్  నిర్వహిస్తారు. మార్చి  16న కౌంటింగ్  నిర్వహించనున్నారు. ఈ నెల  16వ తేదీ నుండి నామినేషన్లను స్వీకరించనున్నారు. ఈ నెల  23వ తేదీని నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీగా నిర్ణయించారు.  ఈ నెల  24న నామినేషన్లను స్కూట్నీ చేస్తారు.  ఈ నెల  27న నామినేషన్ల ఉపసంహరణకు  చివరి తేదీ. మార్చి  13న పోలింగ్  నిర్వహిస్తారు.  ఉదయం 8 గంటల నుండి  సాయంత్రం  4 గంటల వరకు  పోలింగ్  నిర్వహిస్తారు. 

Latest Videos

ఏపీలో  ఎన్నికలు జరిగే పట్టభద్రుల స్థానాలు ఇవే 

 1.ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు
2.కడప-అనంతపురం-కర్నూల్ 
3.శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్టణం

 ఏపీలో  ఎన్నికలు జరిగే టీచర్స్  స్థానాలు ఇవే
1.ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు
2.కడప-అనంతపురం-కర్నూల్ 


 ఏపీ రాష్ట్రంలో  స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే స్థానాలు 

1. అనంతపురం
2. కడప 
3.నెల్లూరు
4.పశ్చిమగోదావరి
5.తూర్పు గోదావరి
6.శ్రీకాకుళం
7.చిత్తూరు
8.కర్నూల్


తెలంగాణలో  ఎన్నికలు జరిగే  టీచర్స్  స్థానం

1.  మహబూబ్ నగర్- రంగారెడ్డి -హైద్రాబాద్ 

 తెలంగాణలో  స్థానిక సంస్థల  ఎన్నికలు  జరిగే  స్థానం
1. హైద్రాబాద్

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  అనంతపురం  స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ స్థానం నుండి దీపక్ రెడ్డి,  కడప  నుండి  బీటెక్ రవి ల పదవీకాలం  ఈ ఏడాది మార్చి 29న ముగియనుంది.  నెల్లూరు నుండి వాకాటి నారాయణరెడ్డి, పశ్చిమగోదావరి నుండి ఎ. రామ్మోహన్ రావు , మంతెన సత్యనారాయణ రాజు,  తూర్పు గోదావరి నుండి  చిక్కాల రామచంద్రరావు,  చిత్తూరు నుండి రాజనర్సింహులు,  కర్నూల్ నుండి  కేఈ ప్రభాకర్ ల పదవీ కాలం ఈ ఏడాది మే  1వ తేదీతో  పూర్తి కానుంది. దీంతో  ఎన్నికలు నిర్వహించనున్నారు.తెలంగాణలోని హైద్రాబాద్ స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ స్థానానికి  సయ్యద్ హసన్ జాఫ్రీ  పదవీ కాలం మే  1వ తేదీతో పూర్తి కానుంది. 

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్  స్థానం నుండి  యండవెల్లి శ్రీనివాసులు రెడ్డి,   కడప-  అనంతపురం- కర్నూల్ పట్టభద్రుల స్థానం నుండి   వెన్నపూస గోపాల్ రెడ్డి ,శ్రీకాకుళం- విజయనగరం- విశాఖపట్టణం  పట్టభద్రుల స్థానం నుండి  పీవీఎన్ మాధవ్ లు ఈ ఏడాది  మార్చి  29వ తేదీన  రిటైర్ కానున్నారు.  

ప్రకాశం-నెల్లూరు- చిత్తూరు టీచర్స్ స్థానం నుండి విఠపు బాలసుబ్రమణ్యం, కడప- అనంతపురం- కర్నూల్  టీచర్  స్థానం నుండి  కత్తి నరసింహరెడ్డిలు  ఈ ఏడాది మార్చి  29న  రిటైర్ అవుతారు.  ఇక తెలంగాణలోని  మహబూబ్ నగర్ -  రంగారెడ్డి - హైద్రాబాద్  టీచర్స్ స్థానం నుండి  కాటేపల్లి జనార్ధన్ రెడ్డి  ఈ ఏడాది మార్చి  29న రిటైర్ కానున్నారు. దీంతో  ఎన్నికల షెడ్యూల్ ను  ఈసీ విడుదల చేసింది.

click me!