జెసి దివాకర్ రెడ్డి లోక్ సభకు రాజీనామా చేస్తారా?

Published : Sep 08, 2017, 03:48 PM ISTUpdated : Mar 25, 2018, 11:47 PM IST
జెసి దివాకర్ రెడ్డి లోక్ సభకు రాజీనామా చేస్తారా?

సారాంశం

అనంతపురం లోక్ సభ నియోజకవర్గంలో తను చెప్పిన పనులేవీ జరగనందున ఎంపి గా ఉండి  ప్రయోజనమేమిటని ఆయన ప్రశ్నిస్తున్నారట

అనంతపురం లోక్ సభ సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి తన సభ్యత్వానికి రాజీనామచేయబోతున్నారనే వార్త కలకలం సృష్టిస్తున్నది. దివాకర్ రెడ్డి ఇపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పైకి బాగా సన్నిహితంగా కనిపిస్తున్నారు. బహుశా టిడిపిలో కమ్మవారికంటే బలంగా బాబు భజన చేసేది దివాకర్ రెడ్డియే. ప్రతి ముఖ్యమయిన మీటింగులో కూడా దివాకర్ రెడ్డికి మైకిస్తారు.  ఆయన జగన్ ను చక్కగా తిడతారు. రాజకీయంగా తిట్టిస్తారు. కులం పరంగా తిట్టిస్తారు.తానేమో ఇదంతా విననట్లు వేదికమీద నుంచి ముఖ్యమంత్రి  అటూ ఇటూ చూస్తుంటారు.స్థానికంగా తెలుగుదేశం కమ్మవారితో ఆయనకు  తంటా వచ్చి పడుతున్నది తప్ప ముఖ్యమంత్రితో   చెప్పుకోదగ్గ సమస్యలేవీ లేవుగదా అని అనిపిస్తుంది. మరీ ఆయన ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు?

తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో ఎంపిగారి నియోజకవర్గం అన్యాయానికి గురువుతున్నదని నిరసనగా లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారట. వచ్చేపార్లమెంటు సమావేశాలలో ఆయన  రాజీనామా ప్రతాన్ని నేరుగా స్పీకర్ సుమిత్రా మహాజన్ కుఅందచేస్తారట, అదికూడా లోక్ సభలోనే. దీనితో ఒక పెద్ద సీన్ క్రియోట్ అవుతుంది.

జిల్లాలో 12 స్థానాలను టిడిపికి తెప్పించడంతో తన కృషి చాలా ఉందని ఆయన  నమ్మకం.  ఎన్నికల పుడు, తర్వాత పర్యటనల్లో  ప్రతిచోటా చెరువులను నీళ్లతో నింపిస్తానని హామీ ఇచ్చారు.  2019 ఎన్నికలు దగ్గరపడుతున్నా ఈ హామీ పూర్తిగా నెరవేరడం లేదు. ఈ చెడ్డపేరొస్తున్నదని ఆయన ఆందోళన చెందుతున్నారట. అందువల్ల ఎంపి పదవికి రాజీనామాచేసి నరసన వ్యక్తం చేయాలనుకుంటున్నారని డిడిపి వర్గాల్లో ఒకటే చర్చ.  చాలా కాలంగా అనంతపురం మునిసిపాలిటిలో ఆయనకు కమ్మవారు వెయిట్ లేకుండా చేశారు. అక్కడ ఎంత గొడవయిందో అందరికి ఎరికే.చివరకు ఆయన నేల మీద కూర్చుని దీక్షకు కూడా దిగాల్సి వచ్చింది. ఇదేవిధంగా ఇతర మంత్రులు అధికారులు  కూడా పెద్దగా పట్టించుకోవడం లేదట.  తర్వాత జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులతో సంప్రదింపులు కష్టంగా ఉన్నాయి. ఒకరు కమ్మ, మరొకరు బాగా జూనియర్. ముఖ్యమంత్రిదగ్గిర గౌరవం బాగానే ఉన్నా పనుల దగ్గిరకు వచ్చే సరికి ఏవీ జరగడం లేదని, అందువల్ల ఎంపిగా కొనసాగి ప్రయోజనం ఏమిటనేది ఆయన ప్రశ్న అని సన్నిహితులు చెబుతున్నారు. అయితే, ఆయన తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతారట. అన్ని విషయాలు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడేజెపి రాజీనామా చర్చ గురించి ఇంకా ఎక్కడ వివరణ ఇవ్వలేదు.

వచ్చే ఎన్నికలలో పోటీ చేసేది లేదని చాలా సార్లు స్పష్టం చేశారు. ఈ రాజీనామా పోరాటం ద్వారా ఆయన 2019లో పోటీచేయనున్న తన కుమారుడికి గుడ్ విల్ సంపాయించేందుకు ఈ ఎత్తుగడ వేస్తున్నానడని టిడిడి లోని ఒక వర్గం చెబుతున్నది.

 

 

 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu