‘నో ఫ్లై లిస్ట్’ ప్రకటించిన విమానయాన శాఖ

First Published Sep 8, 2017, 3:11 PM IST
Highlights
  • విమానయాన సిబ్బందిపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు పౌర విమానయాన శాఖ చర్యలు మొదలుపెట్టింది.
  • శుక్రవారం ‘నో ఫ్లై లిస్ట్’ అంటూ ఓ జాబితాను విడుదల చేసింది.
  • మొత్తం మీద విమాన సంస్ధల సిబ్బందిపై దాడులు పెరుగుతున్న విషయం అర్ధమవుతోంది.

విమానయాన సిబ్బందిపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు పౌర విమానయాన శాఖ చర్యలు మొదలుపెట్టింది. శుక్రవారం ‘నో ఫ్లై లిస్ట్’ అంటూ ఓ జాబితాను విడుదల చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో విమాన సంస్ధల సిబ్బందిపై దాడులు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే కదా? ముంబయ్ నుండి ఢిల్లీకి వెళుతున్న విమానంలోని సబ్బందిపై శివశేన ఎంపి గైక్వాడ్ జరిపిన దాడి దేశంలో సంచలనం రేకెత్తించింది. అది మరచిపోక ముందే విశాఖపట్నం విమానాశ్రయంలో ఇండిగో సంస్ధ సిబ్బందిపై అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి చేసిన దాడి పెద్ద రచ్చే అయ్యింది. అంతుకుముందు తిరుపతి విమానాశ్రయంలో వైసీపీ ఎంపి మిధున్ రెడ్డి ఓ అధికారిపై దాడి చేసినందుకు కేసు నమోదైంది.

మొత్తం మీద విమాన సంస్ధల సిబ్బందిపై దాడులు పెరుగుతున్న విషయం అర్ధమవుతోంది. సామాన్యులు దాడి చేస్తే వెంటనే చర్యలు తీసుకునే సంస్ధలు కుడా ఎంపిలో, ప్రముఖులో దాడి చేసినపుడు చేష్టలుడిగి చూస్తోంది. మహా అయితే కొద్ది రోజులు విమాన ప్రయాణం చేయనీయకుండా అడ్డుకోగలుగుతున్నాయి. దాడి జరిగినపుడల్లా రచ్చ జరగటం కాకుండా దాడుల నియంత్రణకు గట్టి చర్యలు తీసుకోవాలని వచ్చిన విజ్ఞప్తి మేరకు విమానాయాన శాఖ స్పందించింది.

దాడులను మూడు రకాలుగా వర్గీకరించింది. మొదటిది దురుసు ప్రవర్తన: సిబ్బంది పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే 3 నెలలు విమానాల్లో ప్రయాణాలు చేయకుండా నిషేధం అమలవుతుంది. రెండోది: సిబ్బందిపై దాడి చేస్తే 6 నెలల పాటు నిషేధం. మూడోది: హత్యాయత్నానికి పాల్పడితే ఏకంగా 2 సంవత్సరాల పాటు నిషేధిస్తారు. కేవలం నిషేధం వరకే నిర్ణయం తీసుకున్న విమానయాన శాఖ కేసుల గురించి నిర్ణయం తీసుకోకపోవటం విచిత్రంగా ఉంది.

click me!