పులివెందులలో టిడిపినే గెలుస్తుంది

Published : Sep 08, 2017, 02:25 PM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
పులివెందులలో టిడిపినే గెలుస్తుంది

సారాంశం

పులివెందులలో ఇప్పటి వరకు రూ. 10 కోట్ల విలువైన అబివృద్ధి పనులు జరిపినందున తమ పార్టీదే గెలుపని లోకేష్ చెప్పారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందులలో కుడా టిడిపినే గెలుస్తుందని నారా లోకేష్ ధీమా వ్యక్తం చేసారు. 2019లో తమదే గెలుపని జోస్యం చెప్పారు. ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో విద్యాధరపురంలో మాట్లాడుతూ, తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమను గెలిపిస్తాయన్నారు.  మొన్న జరిగిన నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో గెలుపే అందుకు సాక్ష్యంగా పేర్కొన్నారు. పులివెందులలో ఇప్పటి వరకు రూ. 10 కోట్ల విలువైన అబివృద్ధి పనులు జరిపినందున తమ పార్టీదే గెలుపని లోకేష్ చెప్పారు. అదే సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ పై మండిపడ్డారు. తమ ప్రభుత్వం అబివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంటే జగన్ అడ్డుపడుతున్నారంటూ మండిపడ్డారు. పట్టిసీమ ప్రాజెక్టును అడ్డుకున్న ఏకైక వ్యక్తి దేశం మొత్తం మీద జగన్ మాత్రమేనని ఎద్దేవా చేసారు.

PREV
click me!

Recommended Stories

కొడుకుమీద ఈగ వాలనివ్వని తండ్రి | Chandrababu Speech Today | Asianet News Telugu
బాబుకు కొత్త బిరుదు ఇచ్చిన నిమ్మల | Nimmala Ramanaidu Speech | Asianet Telugu