మా వీపు పగిలినప్పుడే చంద్రబాబు వీపు పగలాల్సింది: జేసీ దివాకర్ రెడ్డి

By telugu teamFirst Published Mar 16, 2021, 12:57 PM IST
Highlights

మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ సీఐడి నోటీసులు జారీ చేయడంపై టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబుకు ఒక్క పేజీ మాత్రమే నోటీసులు ఇచ్చారని ఆయన అన్నారు..

హైదరాబాద్: తమ పార్టీ అదినేత నారా చంద్రబాబు నాయుడికి ఏపీ సీఐడి నోటీసు జారీ చేయడంపై టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యుుడు జేసి దివాకర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు సీఐడి నోటీసు ఒక్క పేజీ మాత్రమే ఇచ్చారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఇవ్వాల్సి వస్తే లారీల్లో తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. 

తమ వీపు వీపు పగిలినప్పుడే చంద్రబాబు వీపు కూడా పగలాల్సిందని, ఎందుకు ఆలస్యం జరిగిందనే విషయంపై అనుమానం ఉందని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. మూడు నెలల క్రితమే చంద్రబాబుకు నోటీసులు రావాల్సిందని ఆయన అన్నారు. ప్రభాకర్ రెడ్డి ఇమేజ్ వల్లనే తాడిపత్రిలో ఎక్కువ మంది కౌన్సిర్లను గెలుచుకున్నట్లు ఆయన తెలిపారు.

నోటీసులు చూలి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మూడు నెలల క్రితమే నోటీసులు, అరెస్టులు జరగాల్సిందని ఆయన అన్నారు.

దొనకొండ గానీ విశాఖపట్న గానీ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేయాలని తాను చంద్రబాబుకు చెప్పినట్లు ఆయన తెలిపారు. రాజధానిపై ఒక్కసారి నిర్ణయం జరిగిన తర్వాత మార్చడం సరి కాదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. 

తెలంగాణ ఇచ్చి కాంగ్రెసు తప్పు చేసిందని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెసుకు కాలం చెల్లిందని ఆయన అన్నారు. కాంగ్రెసు నేతలంతా కలిసి పార్టీని చంపేశారని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెసు అధికారంలోకి రాలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి అయిపోదామని కాంగ్రెసును చంపేశారని ఆయన వ్యాఖ్యానించారు 

రాయల తెలంగాణకు జైపాల్ రెడ్డి మద్దతు ఇవ్వలేదని, చివరి వరకు తాము మాజీ కేంద్ర మంత్రి ఎస్ జైపాల్ రెడ్డిని నమ్మినట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటికీ బంగారు తెలంగాణ రాలేదని ఆయన అన్నారు. 

జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం తెలంగాణ శానససభకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలువురు నేతలను కలిశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభకు రావడం ఇదే మొదటి సారి అని ఆయన చెప్పారు. రేపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలుస్తానని ఆయన చెప్పారు.

click me!