Rain Alert: ఆంధ్రప్రదేశ్‌కు మరో వానగండం.. దూసుకొస్తున్న తుఫాన్

By telugu teamFirst Published Dec 1, 2021, 5:53 PM IST
Highlights

భారీ వర్షాలు, వరదలతో అల్లాడిన ఆంధ్రప్రదేశ్‌కు మరో ముప్పు ఉన్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం త్వరలోనే తుఫాన్‌గా పరిణమించే అవకాశం ఉందని, ఇది ఆంధ్రప్రదేశ్, ఒడిశా వైపు దూసుకు వస్తున్నదని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఫలితంగా  శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో రేపటి నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ వాయుగుండం తుఫాన్‌గా బలపడితే దానికి జవాద్ అనే పేరు పెట్టనున్నారు.

అమరావతి: Andhra Pradeshకు మరో వానగండం ఎదురు కానుంది.  ఇప్పటికే భారీ వర్షాల(Heavy Rains)తో రాయలసీమ జిల్లా వాసులు తల్లడిల్లారు. రాయలసీమ సహా మరికొన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురిశాయి. కాగా, మరోసారి తుఫాన్ (Cycone) ఆంధ్రప్రదేశ్‌ను ముంచెత్తనుందనే వాతావరణ శాఖ(IMD) అంచనాలు వచ్చాయి. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టు తెలుస్తున్నది. అది వేగంగా ఉత్తరాంధ్ర ఒడిశా వైపు దూసుకొస్తున్నది. రేపు అది వాయుగుండంగా మారి.. ఎల్లుండి తుఫాన్‌గా పరిణమించబోతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అంచనాలు వేస్తున్నారు. దీంతో వేగంగా వీచే గాలులు, భారీ వర్షాలు మరోసారి ఆంధ్రప్రదేశ్‌ను అల్లకల్లోలం చేసే ముప్పు ఉన్నదని నిపుణులు భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్, ఒడిశా వైపు ఈ అల్పపీడనం దూసుకు వస్తున్నదని, రేపు ఇది నెల్లూరు తీరానికి 1,400 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతం అయ్యే అవకాశముంది. ఇది వాయుగుండంగా మారనుంది. ఎల్లుండి ఇదే తుఫాన్‌గా బలపడుతుందని అంచనాలు వేస్తున్నారు. ఫలితంగా తీరం వెంబడి గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. గత వర్షాలు రాయలసీమపై తీవ్ర ప్రభావం వేయగా, ఈ వర్షాలు ఉత్తరాంధ్రను ముంచెత్తే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో రేపటి నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈ వాయుగుండం తుఫాన్‌గా బలపడితే దానికి జవాద్ అనే పేరు పెట్టనున్నారు.

Also Read: Cyclone Jawad: ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు హై అలర్ట్..

డిసెంబర్ 4వ తేదీ ఉదయం నాటికి ఇది ఉత్తరాంధ్ర- ఒడిశా తీరాలకు చేరుకుని మరింతగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 5, 6 తేదీల్లో తీవ్ర తుపానుగా మారి శ్రీకాకుళం, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర (North Coastal Andhra pradesh), దక్షిణ ఒడిశా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఏపీ విషయానికి వస్తే డిసెంబర్ 2 నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో.. డిసెంబర్ 2వ తేదీ నుంచే భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. తుఫాన్‌ తీరం దాటే సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు.

ఇప్పటికే భారీ వర్షాలు (Heavy rains), వరదలతో  సతమతవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలుకు ఇది మరో పిడుగులాంటి వార్త. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాణ నష్టంతో పాటుగా, భారీగా ఆస్తి నష్టం కూడా చోటుచేసుకుంది. ముఖ్యంగా నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలను భారీ వర్షాలు అతలాకుతం చేశాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు తుఫాన్ (Cyclone)  దూసుకోస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రపైన ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

click me!