దేవతార్చన... ఆయనలోని ఆ విలక్షణతే నన్నెంతో ఆకట్టుకొంది: ప్రణబ్ మృతిపై పవన్

Arun Kumar P   | Asianet News
Published : Aug 31, 2020, 09:11 PM ISTUpdated : Aug 31, 2020, 09:15 PM IST
దేవతార్చన... ఆయనలోని ఆ విలక్షణతే నన్నెంతో ఆకట్టుకొంది: ప్రణబ్ మృతిపై పవన్

సారాంశం

రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ విలక్షణమైన ధ్రువతారగా వెలిగారని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. 

విజయవాడ: అనారోగ్యంతో బాధపడుతూ ఆర్మీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. దేశ అత్యున్నత పదవిని అధిరోహించడమే కాకుండా కేంద్ర మంత్రిగానూ దేశానికి సేవలందించిన ఆయన మృతిచెందడంపై రాజకీయ ప్రముఖులే కాదు సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ప్రముఖ హీరో, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కూడా ప్రణబ్ మరణంపై స్పందించారు. 

''భారత మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు దివంగతులయ్యారనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత రాజకీయాల్లో.. తనదంటూ సొంత ముద్రను కలిగి ఉన్న శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారి మరణం.. దేశానికి తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ప్రణబ్ ముఖర్జీ గారి కుటుంబానికి నా తరఫున జనసేన తరఫున నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.'' అని అన్నారు. 

read more  ప్రణబ్ మృతి... జగన్, చంద్రబాబు దిగ్భ్రాంతి

''స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబంలో పుట్టి.. రాజకీయాల్లో ప్రవేశించిన ప్రణబ్ ముఖర్జీ గారు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులుగా, కేంద్ర  ఆర్థిక శాఖ మంత్రిగా పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.  రాజకీయాల్లో ఆయనొక విలక్షణమైన ధ్రువతారగా వెలిగారు. ఈ దేశం కూడా.. పద్మవిభూషణ్, భారతరత్న పురస్కారాలతో ఆయన సేవలను సముచితంగా సత్కరించుకుంది'' అని అన్నారు. 

''దేశ రాష్ట్రపతిగా ఎదిగినా తన మూలాలు మరచిపోకుండా.. తన పండిట్ల కుటుంబపరంగా వస్తున్న దేవతార్చన సంప్రదాయం అనుసరించి ప్రత్యేక పర్వ దినాలలో  ఆ సంప్రదాయాన్ని అనుసరించడం  విశేషం. ఆ విలక్షణత నన్నెంతో ఆకట్టుకొంది.  ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం.. భవిష్యత్ తరాలకి ఆదర్శనీయం, అనుసరణీయమైనవి'' అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.  


 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!