తెలంగాణలో 23 స్థానాల్లో పోటీచేద్దాం అనుకున్నా కానీ.. పవన్ కామెంట్స్

Published : Nov 10, 2018, 01:53 PM IST
తెలంగాణలో 23 స్థానాల్లో పోటీచేద్దాం అనుకున్నా కానీ.. పవన్ కామెంట్స్

సారాంశం

తెలంగాణలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఎన్నికల్లో పోటీ చేయడం విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.

తెలంగాణలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఎన్నకల్లో పోటీ చేయడం విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. గతంలో తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తానని పవన్ చెప్పిన  సంగతి తెలిసిందే కాగా.. తర్వాత తన దృష్టి అంతా కేవలం ఏపీ పైనే పెట్టారు. కాగా.. తాజాగా ఈ విషయంపై మాట్లాడారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై రెండు మూడు  రోజుల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ముందస్తు ఎన్నికలు రావడం, సన్నద్ధత లేకపోవడంపై పోటీపై సమాలోచనలు చేస్తున్నామని ఆయన అన్నారు. ముందస్తు కాకుండా వచ్చే ఏడాది ఎన్నికలు వస్తే 23 స్థానాల్లో పోటీ చేయాలని, మూడు పార్లమెంట్ స్థానాల్లో పోటీచేయాలని భావించినట్లు వివరించారు. 

కానీ తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావడంతో.. సందిగ్ధత ఏర్పడిందని పవన్ అన్నారు. అయితే.. కొందరు స్వతంత్రంగా నిలబడతామని.. వారికి తన మద్దతు ఇవ్వాలని కోరుతున్నారని చెప్పారు. అన్ని విషయాలపై చర్చించి రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం చెబుతానని అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు