ఇక ఎన్నికలకు సంసిద్ధమవ్వాలి: కార్యకర్తలకు జనసేన పార్టీ పిలుపు

Published : Dec 23, 2018, 04:05 PM IST
ఇక ఎన్నికలకు సంసిద్ధమవ్వాలి: కార్యకర్తలకు జనసేన పార్టీ పిలుపు

సారాంశం

జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఆ పార్టీ అధినాయకత్వం పిలుపునిచ్చింది. జనసేన పార్టీకి ఉమ్మడి ఎన్నికల గుర్తు గాజు గ్లాసు ప్రకటించిన నేపథ్యంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరం, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ లు హర్షం వ్యక్తం చేశారు.

విజయవాడ: జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎన్నికలకు సంసిద్ధం కావాలని ఆ పార్టీ అధినాయకత్వం పిలుపునిచ్చింది. జనసేన పార్టీకి ఉమ్మడి ఎన్నికల గుర్తు గాజు గ్లాసు ప్రకటించిన నేపథ్యంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మాదాసు గంగాధరం, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ లు హర్షం వ్యక్తం చేశారు. 

ఉమ్మడి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాసుని జాతీయ ఎన్నికల కమిషన్ ప్రకటించడం సంతోషకరమన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ ఎన్నికల గుర్తుని ప్రతి గడప గడపకి జనసేన కార్యకర్తలు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలలో ,ఆంధ్రప్రదేశ్ లోని శాసన సభ ,పార్లమెంటు ఎన్నికల బరిలోకి జనసేన దిగుతోందని స్పష్టం చేశారు. తెలంగాణ లో జనసేన కార్యకర్తలు పార్లమెంటు ఎన్నికలకి సంసిద్ధం అవ్వాలని శంకర్ గౌడ్ పిలుపు నిచ్చారు. 

త్వరలొనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో తెలంగాణ పార్లమెంటు ఎన్నికల గురించి చర్చిస్తాం అని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీకి ఉమ్మడి గుర్తుని కేటాయించి నందుకు జాతీయ ఎన్నికల సంఘానికి కృతఙ్ఞతలు తెలిపారు. 

 

ఈ వార్తలు కూడా చదవండి

జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాస్

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?