పవన్‌పై గుంటూరు మేయర్‌ అనుచిత వ్యాఖ్యలు.. జనసేన నిరసనలు.. కొనసాగుతున్న హౌస్ అరెస్టులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గుంటూరు మేయర్ కావటి మనోహర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. మేయర్ మనోహర్ వ్యాఖ్యలపై జనసేన నాయకులు,  కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

Google News Follow Us

గుంటూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై గుంటూరు మేయర్ కావటి మనోహర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర కలకలం రేపుతుంది. మేయర్ మనోహర్ వ్యాఖ్యలపై జనసేన నాయకులు,  కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గుంటూరు జిల్లా, నగర జనసేన పార్టీ ఛలో గుంటూరు మేయర్ ఇంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మేయర్ ఇంటి వద్దకు వెళ్లేందుకు జనసేన నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మేయర్ కావటి మనోహన్ ఇంటి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ముందస్తు చర్యల్లో భాగంగా మేయర్ ఇంటి  పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. పలువురు జనసేన నేతలను గృహనిర్భందం చేశారు. ఇక, మేయర్ వ్యాఖ్యలపై నిరసనకు సిద్దమైన జనసేన నేతలు బోనబోయిన శ్రీనివాస్, గాదె వెంకటేశ్వరావులను అరెస్టు చేసి నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరోవైపు గుంటూరు జిల్లా జనసేన కార్యాలయంలో పార్టీ నేతల్ని పోలీసులు నిర్బంధించారు. 

అయితే ఈ పరిణామాలను జనసేన నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరికాసేపట్లో గుంటూరు జిల్లా జనసేన  పార్టీ  కార్యాలయానికి జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేరుకోనున్నారు. 
 

Read more Articles on