లోకేశ్ రెడీగా ఉండు.. నెక్స్ట్ నువ్వే జైలుకు.. త్వరలో ముద్దాయిగా.. : మంత్రి మేరుగు నాగార్జున

Published : Sep 12, 2023, 01:29 PM IST
లోకేశ్ రెడీగా ఉండు.. నెక్స్ట్ నువ్వే జైలుకు.. త్వరలో ముద్దాయిగా.. : మంత్రి మేరుగు నాగార్జున

సారాంశం

నారా లోకేశ్ రెడీగా ఉండాలని, త్వరలో ఆయన కేసుల్లో ముద్దాయిగా తేలుతారని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఇది వరకు అన్ని కేసుల్లో చంద్రబాబు నాయుడు ముద్దాయిగా ఉన్నారని, అరెస్టు అయ్యాడని వివరించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కామెంట్ చేశారు.  

అమరావతి: చంద్రబాబు అరెస్టు ఎపిసోడ్ పై రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి మేరుగు నాగార్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రజల సొమ్ము దోచుకున్నాడని, చివరికి జైలు పాలయ్యాడని అన్నారు. దొంగతనం చేసి చట్టానికి దొరికాడని పేర్కొన్నారు. చట్టాలేమీ ఆయనకు చుట్టాలు కాదని కామెంట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, చంద్రబాబు మరిన్ని కేసుల్లో ఇరుక్కోవడం ఖాయం అని అన్నారు. ఆయన జీవితమంతా అవినీతి మయమే అని తెలిపారు. అన్ని కేసుల్లో చంద్రబాబే ముద్దాయి అని వివరించారు. అదే విధంగా నారా లోకేశ్ కూడా త్వరలో ముద్దాయి కాబోతున్నాడని అన్నారు. ఆయన కూడా జైలుకు వెళ్లుతారని జోస్యం చెప్పారు. అందుకే ఇకనైనా చంద్రబాబు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు.

నారా లోకేశ్ బూతులు మానుకోవాలని మంత్రి మేరుగు నాగార్జున సూచించారు. తాము కూడా బూతులు మాట్లాడితే తట్టుకోలేరని కామెంట్ చేశారు. పేదలకు సీఎం జగన్ పారదర్శకంగా సేవలు అందిస్తుంటే చంద్రబాబు తట్టుకోలేకపోయారని ఆరోపించారు. అందుకే దత్తపుత్రుడిని వెంటేసుకుని ఎడాపెడా ఆరోపణలు చేశారని విమర్శించారు.

అన్ని కేసుల్లో చంద్రబాబు ముుద్దాయి అని మంత్రి వివరించారు. అంతేకానీ, తమకు చంద్రబాబు మీద కక్ష లేదని స్పష్టం చేశారు. కక్షే ఉంటే అధికారంలోకి వచ్చాకే అరెస్టు చేయించేవారమని కానీ,  ఇప్పుడు ఆయన చేసిన పాపాలకు ఆయనే శిక్ష అనుభవిస్తున్నారని కామెంట్ చేశారు. కోర్టుల్లో ముద్దాయిగా నిలబడక తప్పదని అన్నారు.

Also Read: Chandrababu: టీడీపీ నేతకు అఖిలేశ్ యాదవ్ ఫోన్.. చంద్రబాబు అరెస్టుపై సీరియస్‌ రియాక్షన్

పవన్ కళ్యాణ్ హడావుడి ఏమిటో అర్థం కాలేదని మంత్రి విమర్శించారు. చంద్రబాబును అరెస్టు చేయగానే హడావుడిగా వచ్చారని, అంతే హడావుడిగా వెళ్లిపోయారని కామెంట్ చేశారు. ఎందుకు వచ్చాడో? ఎందుకు రోడ్డుపై పడుకున్నాడో? ఆయనకే తెలియాలి అని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ బంద్‌కు పిలుపు ఇస్తే స్పందన రాలేదని, జనం ఎవరూ బంద్ పట్టించుకోలేదని తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ ఏపీలో బంద్‌కు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu