మాస్క్ పెట్టుకోండి.. ఫ్యూచర్‌లో నేను గొడవ పడాలిగా: విజయసాయిపై నాగబాబు సెటైర్లు

By Siva Kodati  |  First Published Apr 23, 2020, 2:38 PM IST

కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో రోజరోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో సమిష్టిగా పోరాడాల్సింది పోయి రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల వ్యవహరంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది. 


కరోనా వైరస్ ఆంధ్రప్రదేశ్‌లో రోజరోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో సమిష్టిగా పోరాడాల్సింది పోయి రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. జగన్ ప్రభుత్వం కొనుగోలు చేసిన ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల వ్యవహరంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేగింది.

దీనిపై టీడీపీ, బీజేపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అంతకుముందే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, జనసేన నేత , సినీనటుడు నాగబాబు మధ్య మాటల యుద్ధం నడవటంతో మెగాబ్రదర్ ఆ తర్వాత దానికి ఫుల్‌స్టాప్ పెట్టేశారు. పది రోజుల విరామం అనంతరం మళ్లీ విజయసాయిని టార్గెట్ చేశారు నాగబాబు.

Latest Videos

undefined

Also Read:ఏపీలో కరోనా విలయతాండవం: కొత్తగా 80 కేసులు, 27కు చేరిన మరణాలు

‘‘ విజయసాయి రెడ్డి.... మాస్క్ ముక్కు నోటికి పెట్టుకోండి.. గొంతుకి కాదు, ఒకవేళ మీరు asymptomatic అయినా ప్రాబ్లెమ్ ఉండదు. మీ సెక్యూరిటీ కూడా మాస్కులు పెట్టుకున్నారు. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ‘‘ఫ్యూచర్‌లో ఫైట్ చేసుకోవాలిగా మీతో.. మీకు మాస్క్ ఉన్నా జనం గుర్తు పడతారు... నేను గారంటీ అంటూ గురువారం నాగబాబు ట్విట్టర్‌లో సెటైర్లు వేశారు.

మరి మెగా బ్రదర్ కామెంట్‌పై విజయసాయి రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు కరోనా కట్టడికి  పలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ రాష్ట్రంలో వైరస్ అంతకంతకూ పెరుగుతోంది.

గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 80 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 893కి చేరుకోగా, ఇప్పటి వరకు 27కి చేరుకుంది. కర్నూలులో కొత్తగా 31 కేసులు, గుంటూరులో 18 నమోదయ్యాయి.

విజయ సాయి రెడ్డి .మాస్క్ ముక్కు నోటికిపెట్టుకోండి.గొంతుకి కాదు.ఒక వేళ మీరు asymptomatic అయినా ప్రాబ్లెమ్ ఉండదు.మీ సెక్యురిటి కూడా masks పెట్టుకున్నారు.మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్త గా చూసుకోండి.ఫ్యూచర్ లో ఫైట్ చేసుకోవాలిగా మీతో. మీకు మాస్క్ వున్నా జనం గుర్తు పడతారు.నేను గారంటీ... pic.twitter.com/iTAU7xCtG9

— Naga Babu Konidela (@NagaBabuOffl)
click me!