కరోనాపై పోరాడేందుకు రాష్ట్ర ప్రజల్లో రోగ నిరోదక శక్తిని పెంచే హోమియోపతి మందులను తయారుచేసింది ఏపి ఆయుష్ విభాగం.
గుంటూరు:ఆంధ్రప్రదేశ్ ఆయుష్ డిపార్ట్మెంట్ కరోనా వైరస్ భారీ నుండి బయటపడేందుకు హోమియో మందులను సిద్దం చేసింది. ఆర్సీనిక్ ఆల్బా 30 అనే హోమియో మెడిసిన్ ను ఆయుష్ డిపార్ట్మెంట్ తయారు చేసింది. వీటిని వాడటం వలన కరోనా మహమ్మారి నుండి బయటపడే అవకాశం ఉందని హోమియో డాక్టర్లు చెబుతున్నారు.
ఈ మందులను వాడటం వలన మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్ భారిన పడకుండా ఉండొచ్చని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 కోట్ల మంది ప్రజలకు ఈ మెడిసిన్ అందేలా చర్యలు చేపట్టారు.
undefined
ఆయుష్ డిపార్ట్మెంట్ కమిషనర్ ఉషా కుమారి ఆదేశాల మేరకు ఇప్పటికే రెడ్ జోన్ ప్రాంతాల్లో హోమియో మెడిసిన్ ను పంపిణీ చేశారు. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి 25 వేల 1 డ్రామ్ బాటిల్ లను పంపిణీ చేసేందుకు సన్నద్ధం అయ్యారు. ఒక్కో 1 డ్రామ్ బాటిల్ లో వుండే హోమియో మందును కుటుంబంలోని 6 మంది సభ్యులు వాడవచ్చని వైద్యులు పేర్కొన్నారు.
5 సంవత్సరం లోపు పిల్లలు రోజుకు 3 పిల్స్ చొప్పున 3 రోజుల పాటు వాడాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల పైబడిన వారు రోజుకు 6 పిల్స్ చొప్పున 3 రోజుల పాటు వాడాల్సి ఉంటుంది. ఈ మందులను చేత్తో పెట్టుకోకుండా బాటిల్ మూత సహాయంతో వేసుకోవాలని హోమియో నిపుణులు చెబుతున్నారు.
ఈ మేరకు హోంమంత్రి మేకతోటి సుచరితక 25 వేల 1 డ్రామ్ బాటిల్లను అప్పగించారు ఆయుష్ అధికారులు. గుంటూరు జిల్లా నోడల్ ఆఫీసర్ బాబు బాలాజీ ప్రకాశ్, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సత్యబాబు, డాక్టర్ రాగలత లు హోంమంత్రి సుచరిత కలిసి హోమియో మందులను అందించారు. గ్రామ సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి హోమియో మందులను పంపిణీ చేస్తామని హోంమంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.