ఏపీలో కరోనా విలయతాండవం: కొత్తగా 80 కేసులు, 27కు చేరిన మరణాలు

Published : Apr 23, 2020, 02:02 PM IST
ఏపీలో కరోనా విలయతాండవం: కొత్తగా 80 కేసులు, 27కు చేరిన మరణాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 80 కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కరోనా వైరస్ కట్టడికి పలు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతున్నప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో 80 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 893కు చేరుకుంది. ఏపీలో మరణాల సంఖ్య 27కు చేరుకుంది.

కరోనా వైరస్ వ్యాప్తితో కర్నూలు అట్టుడుకుతోంది. కర్నూలు జిల్లాలో కొత్తగా 31 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం 234 కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానం గుంటూరు జిల్లా ఆక్రమించింది. గుంటూరు జిల్లాలో కొత్తగా గత 24 గంటల్లో 18 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 195కు చేరుకుంది.

తాజాగా గత 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో 2 కేసులు రికార్డయ్యాయి.అనంతపురం జిల్లాలో ఆరు, విశాఖపట్నం జిల్లాలో ఒక్క కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 6 కేసులు, కృష్ణా జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గత 24 గంటల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు నమోదు కాలేదు. 

ఇప్పటి వరకు 141 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం 725 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కాగా, గుంటూరు జిల్లాలో 8 మంది మరణించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కరోనా వైరస్ కారణంగా ఏడుగురేసి మరణించారు. నెల్లూరు జిల్లాలో ఇద్దరు, అనంతపురం జిల్లాలో ముగ్గురు మరణించారు. 

జిల్లాలవారీగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య ఇలా ఉంది...

అనంతపురం 42
చిత్తూరు 73
తూర్పు గోదావరి 32
కడప 51
కృష్ణా 88
కర్నూలు 234
నెల్లూరు 67
ప్రకాశం 50
విశాఖపట్నం 22
పశ్చిమ గోదావరి 39
గుంటూరు 195

 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: హీరో మోటార్స్ విస్తరణ సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
బొజ్జల సుధీర్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Bojjala Sudheer Reddy Powerful Speech | Asianet Telugu