
లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఒకే దేశం- ఒకే ఎన్నికలు(one nation- one election) అనే అంశంపై కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వం వహిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంతో అటు అధికార, ప్రతిపక్షాల తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో కేంద్రానికి మిత్ర పార్టీలు మద్దతు ప్రకటించగా.. ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నాయి.
తాజాగా ఏపీలోని పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఒకే దేశం- ఒకే ఎన్నికలు(one nation- one election) అంశానికి మద్దతు తెలిపింది. ఈ అంశంపై ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ.. వన్ నేషన్- వన్ ఎలక్షన్ కు జనసేన పార్టీ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. ఈ నినాదం పై కేంద్ర ప్రభుత్వంతో సమాలోచనలు జరుగుతామని అన్నారు. ఈ అంశంపై బీజేపీ పెద్దలు పవన్ కళ్యాణ్ తో చర్చించారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.
దేశమంతా ఒకేసారి ఎన్నికల నిర్వహిస్తే ప్రజాదానం ఆదావుతుందని, అలాగే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. అందుకే జనసేన పార్టీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ నినాదానికి మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. అదే సమయంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రపై స్పందిస్తూ... త్వరలో తేదీలను ఖరారు చేస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పరిస్థితులను బట్టి పొత్తులు ఉంటాయని పేర్కొన్నారు.