
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడలో ఆయన ముస్లింలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. బీజేపీతో పొత్తు పెట్టుకునే ఏ పార్టీ ముస్లింలకు నచ్చదన్నారు. జగన్ క్రిస్టియన్ కాబట్టే ఆయనని నమ్మొచ్చని ముస్లీంలు అనుకుంటున్నారని పవన్ వ్యాఖ్యానించారు. నిజంగా అల్లాను ప్రార్ధిస్తే సత్యం చెప్పేవాడు ఒకడు మీకు తప్పకుండా కనిపిస్తాడని జనసేనాని పేర్కొన్నారు. భారత్‌లో 17 శాతం ముస్లింలు వున్నారంటే సమాజం అందరినీ గౌరవిస్తోందని అర్ధమని పవన్ పేర్కొన్నారు. తాను బీజేపీతో వున్నానని ముస్లింలు భావిస్తే.. నష్టపోతారని జనసేనాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే.. సోమవారం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తనకున్న కెపాసిటీకి ఏదో ఒక పదవి పోందవచ్చని, ఇన్ని మాటలు పడాల్సిన అవసరం లేదన్నారు. అధికారమే అంతిమ లక్ష్యం అనుకుంటే ఇంత కష్ట పడాల్సిన పనిలేదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను చాలా కమిట్‌మెంట్‌తో జనసేన పార్టీని స్ధాపించానని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం సీఎం జగన్‌లాగా తాను అద్భుతాలు చేస్తానని చెప్పనని.. మీ విశ్వాసం సరైన వ్యక్తులపై పెట్టడం లేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ALso Read: నా కెపాసిటీకి ఏదో ఒక పదవి పొందొచ్చు.. కానీ , చేతులెత్తి మొక్కుతున్నా .. గెలిపించండి : పవన్ సంచలనం
వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ఆయన రెండు చేతులెత్తి నమస్కరిస్తూ అభ్యర్ధించారు. తనకు ఎంపీలనిస్తే.. పని చేయిస్తానని, పవన్‌కు ఇంత ఓటు షేర్ వుంది కాబట్టే నన్ను ప్రధానమంత్రి పిలిచారని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజల ఆదాయాన్ని సీఎం జగన్ ముగ్గురికి అంటగట్టేశారని .. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇసుక బిజినెస్ చేసే మూడు కంపెనీలు వున్నాయని పవన్ ఆరోపించారు. వాటికి రూ.10 వేల కోట్లు వెళ్లిపోతున్నాయన్నారు. తనకు ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.