సుగాలి ప్రీతి కేసు సీబీఐకి: పవన్ స్పందన ఇదీ

By narsimha lodeFirst Published Feb 19, 2020, 1:07 PM IST
Highlights

సుగాలి ప్రీతి కేసును సీబీఐకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. 


 అమరావతి: సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం మంచి పరిణామమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం సుగాలి ప్రీతి కుటుంబానికి ఊరట కల్గిస్తోందన్నారు.

 కర్నూల్ జిల్లాలో ఏపీ సీఎం వైఎస్ జగన్ సుగాలి ప్రీతి ఫ్యామిలీ మెంబర్లను కలుసుకొన్నారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ విషయమై బుధవారం నాడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడంలో ఇప్పటికే ఆలస్యమైందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.  సీబీఐ విచారణ ద్వారా ఆ ప్రక్రియను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు జనసేనాని.  

Also read: ప్రీతి కుటుంబానికి న్యాయం, సీబీఐకి కేసు: జగన్

పాఠశాలకు వెళ్ళిన చిన్నారిపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఉసురు తీసినవాళ్లని కఠినంగా శిక్షించాలని కర్నూలు నగరం నడిబొడ్డున లక్షల మంది ప్రజలు నినదించారని ఆయన గుర్తు చేశారు.  ప్రభుత్వంలో కదలిక వచ్చేలా సుగాలీ ప్రీతి కుటుంబం వెన్నంటి ఉన్న జనసేన నాయకులకీ, జన సైనికులకీ, ప్రజా సంఘాలకీ  పవన్ కళ్యాణ్ అభినందించారు. 
 

click me!