నీ పతనం ప్రారంభం : ద్వారంపూడి .. నీ సామ్రాజ్యం కూలుస్తా , లేదంటే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు

Siva Kodati |  
Published : Jun 18, 2023, 09:41 PM IST
నీ పతనం ప్రారంభం : ద్వారంపూడి .. నీ సామ్రాజ్యం కూలుస్తా , లేదంటే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు

సారాంశం

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కాకినాడను డ్రగ్స్ డెన్‌గా మార్చేశారని.. ఇక్కడి నుంచే బియ్యం అక్రమంగా రవాణా అవుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. డ్రగ్స్ సూత్రధారి లోకల్ ఎమ్మెల్యేనని.. ఆయనపై ఢిల్లీలో ఓ ఫైల్ ఓపెన్ అయ్యిందని చెప్పారు. కాకినాడను డ్రగ్స్ డెన్‌గా మార్చేశారని.. ఇక్కడి నుంచే బియ్యం అక్రమంగా రవాణా అవుతోందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. బియ్యం అక్రమ రవాణాకు డెకాయిట్ ద్వారంపూడే కారణమన్నారు. ద్వారంపూడి నీ నేర సామ్రాజ్యాన్ని కూల్చేయకపోతే నా పేరు పవన్ కాదంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నుంచి ద్వారంపూడి పతనం ప్రారంభమైందన్నారు. ఆడపిల్లల జోలికొస్తే భీమ్లా నాయక్ ట్రీట్‌మెంట్ ఇస్తానని పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. 

చిత్ర పరిశ్రమంటే పవన్ కల్యాణ్ ఒక్కడే కాదని.. సినిమాను, రాజకీయాలను వేరుగా చూడాలని ఆయన సూచించారు. తనకు ప్రతీరోజూ చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని చంపి.. గుండెపోటని కట్టుకథలు అల్లారని ఆయన ఆరోపించారు. తండ్రి కేసుపై పోరాటం చేస్తున్న వైఎస్ సునీత చివరికి ఒంటరిగా మిగిలిపోయారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ లాంటి మహమ్మారుల మీద రీసెర్చ్ చేసిన గొప్ప వ్యక్తి సునీత అన్నారు. 

Also Read: ఒళ్లు కొవ్వెక్కి కోట్టుకుంటున్నాడు.. కోన్‌కిస్కాగాడు .. ద్వారంపూడిని ఈసారి గెలవనివ్వను: పవన్ కళ్యాణ్

జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి జగన్ మరిచిపోయాడని పవన్ దుయ్యబట్టారు. జనసేన అధికారంలోకి వస్తే.. లక్ష మంది యువతకు ఆర్ధిక సాయం చేసి ఉపాధి చూపుతానని అన్నారు. ముఖ్యమంత్రి, పెద్దిరెడ్డిల కుటుంబాలకే ఇసుక కాంట్రాక్ట్‌లు వెళ్తున్నాయని.. తద్వారా రూ.10 వేల కోట్లు దోచుకుంటున్నారని పవన్ ఆరోపించారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!