జగన్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు: పవన్

By narsimha lodeFirst Published Dec 31, 2019, 12:12 PM IST
Highlights

రాత్రికి రాత్రే నగరాన్ని నిర్మించలేమని జనసేన చీఫ్ పవన్ కళ్య ాణ్ అభిప్రాయపడ్డారు. 

అమరావతి: జగన్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోతోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. అధికారం శాశ్వతం కాదన్నారు.ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ఎడారి లాంటి పదాలను ఉపయోగించవద్దని పవన్ కళ్యాణ్ సూచించారు. జగన్ ప్రభుత్వం శాశ్వతం కాదు,ఎప్పుడైనా కూలొచ్చని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు.

మంగళవారం నాడు ఎర్రబాలెం రైతులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి నిర్వహించారు.న్యాయం చేస్తుందని వైసీపీకి ఓటేస్తే మోసం చేస్తున్నారు. అమరావతిపై జగన్ కు ఎందుకు కక్ష అని ఆయన ప్రశ్నించారు. హైకోర్టు తరలింపు సుప్రీంకోర్టు పరిధిలో ఉంటుందన్నారు. హైకోర్టును చూపించి రాయలసీమ ప్రజలను మోసం చేసేందుకు జగన్ ప్రయత్నం చేస్తున్నారని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు.

రాజధాని ప్రాంత రైతులతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు భేటీ అయ్యారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు 14 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రైతుల ఆందోళనలకు మద్దతుగా పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు పర్యటిస్తున్నారు.

Also read:రాజధాని రచ్చ: రంగంలోకి భువనేశ్వరీ,భర్తతో కలిసి దీక్ష

ఏపీలో మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా సంకేతాలు ఇచ్చారు.దీంతో ఏపీ రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు 14 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 

Also read:రాజధాని చిచ్చు: అమరావతిలో నేడు పవన్ కళ్యాణ్ పర్యటన

ఆందోళనలు చేస్తున్న రైతులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు మద్దతు ప్రకటించారు. రాజధాని రైతుల సమస్యలను పవన్ కళ్యాణ్ తెలుసుకొన్నారు. ఒక్క నగరాన్ని రాత్రికి రాత్రే నిర్మించలేమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. 

పిల్లల భవిష్యత్తు కోసమే రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు భూములను ఇచ్చారని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.  అమరావతి పేరిట బాండ్లను విక్రియించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

జాతీయ సమగ్రతకు భంగం కలగకుండా ఉండాలనేదే జనసేన సిద్దాంతమని పవన్ కళ్యాణ్ చెప్పారు. చక్కటి రాజధాని కావాలని  ఆనాడు అందరూ భావించారని ఆయన గుర్తు చేశారు.  ఐదు కోట్ల మంది ప్రజల పాలనా రాజధానిగా అమరావతి ని నిర్ణయించారన్నారు. కొన్ని‌ దశాబ్దాల పాటు అభివృద్ధి కొనసాగాలన్నారు.

33వేల ఎకరాలు‌ భూసమీకరణ అంటే నేను భయపడ్డాననని పవన్ కళ్యాణ్ చెప్పారు. అమరావతిని రాజధానిగా చంద్రబాబునాయుడు ప్రకటిస్తే జగన్ అంగీకరించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. 

ప్రజలు ముందుకు‌ వచ్చి ప్రభుత్వానికి భూములు ఇచ్చారన్నారు. ఇప్పుడు ప్రభుత్వమే రైతులను మోసం చేసిందన్నారు. రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా కూడ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

తమ పార్టీ కూడ ఒకే రాజధాని ఉండాలని ఏకాభిప్రాయంతో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తాను రైతులకు అండగా మీకు అండగా ఉంటాను... నా వంతు పోరాటం చేస్తానని చెప్పారు. రైతులు పోరాటాన్ని ఆపకూడదన్నారు. 

మీ భవిష్యత్తు కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు రైతులకు ఉందన్నారు. పోలీసులు కూడ మానవీయ కోణంలో ఆలోచించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.రైతులపై అక్రమ కేసులను బనాయించకూడదని పవన్ కళ్యాణ్ సూచించారు. అందరం రాజధాని కోసం ఉద్యమించాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. 


 

click me!