రాజధాని రైతులకు మద్దతుగా చంద్రబాబు దంపతులు బుధవారం నాడు దీక్షలు చేయనున్నారు.
అమరావతి: అమరావతి రైతులకు మద్దతుగా టీడీపీ చీప్ చంద్రబాబునాయుడు దంపతులు జనవరి 1వ తేదీన దీక్షకు దిగనున్నారు. కొత్త సంవత్సర వేడులకు దూరంగా ఉండాలని చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొన్నారు.
అమరావతిలోనే రైతులు దీక్షను కొనసాగించాలని కోరుతూ 14 రోజులుగా రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఏపీని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో రాష్ట్ర ప్రభుత్వం జీఎన్ రావు,బోస్టన్ కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
undefined
Also read:రాజధాని చిచ్చు: అమరావతిలో నేడు పవన్ కళ్యాణ్ పర్యటన
జీఎన్ రావు కమిటీ రిపోర్టు ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. బోస్టన్ కమిటీ రిపోర్టు మరో మూడు రోజుల్లో అందనుంది. దీంతో రైతులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేశారు.
అమరావతి రైతుల దీక్షలకు చంద్రబాబునాయుడు ఇదివరకే సంఘీభావం ప్రకటించారు. రాజధాని పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. మరో వైపు రాజధాని ప్రాంత రైతుల దీక్షలకు చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరీ మద్దతు పలకనున్నారు.
జనవరి 1వ తేదీన చంద్రబాబునాయుడు దంపతులు రాజధాని పరిసర ప్రాంతంలో రైతులతో కలిసి దీక్షలు నిర్వహించనున్నారు. రాజధాని ప్రాంత రైతుల ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని కొత్త సంవత్సర వేడుకలకు కూడ దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.