మేం సహనం కోల్పోవాల్సి వస్తోంది: వైసీపీకి పవన్ కళ్యాణ్ వార్నింగ్

By narsimha lode  |  First Published Jan 22, 2021, 12:33 PM IST

రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 142 ఆలయాలపై దాడులు జరిగితే  ప్రభుత్వం ఏం చేసిందని జనసేన ఆయన  ప్రశ్నించారు.
 


 తిరుపతి: రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆరోపించారు. 142 ఆలయాలపై దాడులు జరిగితే  ప్రభుత్వం ఏం చేసిందని జనసేన ఆయన  ప్రశ్నించారు.

శుక్రవారం నాడు ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. మసీదులు, చర్చిలపై దాడులు జరిగితే గగ్గోలు పెట్టేవారు... దేవాలయాలపై దాడులను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు.

Latest Videos

undefined

ఆలయాలపై దాడి చేసినట్టుగా ప్రకటించిన వారిపై ఏ రకమైన చర్యలు తీసుకొన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఉదాసీనత వల్లే దేవాలయాల్లో దాడులు చోటు చేసుకొంటున్నాయని ఆయన ఆరోపించారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారీతిలో మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ విషయమై ప్రశ్నించిన ఇతర పార్టీల నేతలపై దాడులకు దిగుతున్నారన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై కూడ అధికార పార్టీ వారు దాడికి దిగుతున్నారన్నారు. 

అన్ని మతాల పట్ల సమభావవమే సెక్యులరిజమన్నారు. సెక్యులరిజం అంటే హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే మౌనంగా ఉండటమా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30ని ఉపయోగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టడం సరైందా అని ఆయన అడిగారు.

పరిస్థితి ఇలానే కొనసాగితే తాము కూడ సహానాన్ని కోల్పోవాల్సి వస్తోందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మతం కంటే మానవత్వం గొప్పదని తాము నమ్ముతామన్నారు. తిరుపతి ఉప ఎన్నిక విషయమై తాము పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశంలో చర్చించామన్నారు. 
 

click me!