ఏపీలో స్థానిక సంస్థల పంచాయితీ: సుప్రీంలో ఉద్యోగుల జేఏసీ పిటిషన్

By narsimha lode  |  First Published Jan 22, 2021, 11:46 AM IST

 ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై  హైకోర్టు ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ ఉద్యోగుల సంఘం జేఏసీ శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
 


అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై  హైకోర్టు ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ ఉద్యోగుల సంఘం జేఏసీ శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.స్థానిక సంస్థల ఎన్నికల విషయమై హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఈ నెల 21 వ తేదీన  ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు సవాల్ చేసింది.

also read:గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ: స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ

Latest Videos

ఎన్నికల నిర్వహణ పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా లేదు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల నిర్వహణ ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని గతంలో ఏపీ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం వాదించింది.అయితే హైకోర్టు ధర్మాసనం మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు.

ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్నికల నిర్వహణలో పాల్గొనాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తే ప్రయోజనంగా ఉంటుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.

ఎన్నికల నిర్వహణ విషయంలో ఏపీ హైకోర్టు ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు ఏపీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు పిటిషన్ దాఖలు చేశారు.

click me!