నమ్మశక్యంగా లేదు.. పొలిటికల్ డ్రామాలా వుంది: జల వివాదంపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jul 7, 2021, 8:20 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల జలవివాదం నమ్మశక్యంగా లేదని ఆరోపించారు. దీనిని ఇరు రాష్ట్రాల సీఎంల విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా సఖ్యతగా వుంటున్నామని ప్రకటించారని పవన్ గుర్తుచేశారు. 

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరు రాష్ట్రాల జలవివాదం నమ్మశక్యంగా లేదని ఆరోపించారు. దీనిని ఇరు రాష్ట్రాల సీఎంల విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పారు. ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా సఖ్యతగా వుంటున్నామని ప్రకటించారని పవన్ గుర్తుచేశారు. అలాంటప్పుడు వివాదాలు ఎందుకు వస్తున్నాయని జనసేనాని ప్రశ్నించారు. ఈ వివాదం రాష్ట్రాల మధ్య పొలిటికల్ డ్రామాగా వుందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. నిరుద్యోగ యువత కోసం త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని ఆయన తెలిపారు. 

అంతకుముందు బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ అక్కడనుండి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కరోనాతో మృతిచెందిన వారికి‌ నివాళులు అర్పించారు. నంద్యాలలో మృతి చెందిన జనసేన కార్యకర్త ఆకుల సోమేష్ కుటుంబ సభ్యులుకు ఐదు లక్షల చెక్ ను అందచేశారు పవన్. 

Also Read:ప్రస్తుతం జనసేన పార్టీని నడపడం సాహసమే: పవన్ కల్యాణ్ సంచలనం

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... ఎంతోమంది జనసేన నాయకులు, జనసైనికులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. జన సైనికులను కోల్పోవడం నన్ను వ్యక్తిగతంగా ఎంతో బాధించింది. వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నానని అన్నారు. 

click me!