ఏపీలో కొత్తగా 3,166 కరోనా కేసులు.. ఉభయ గోదావరి జిల్లాల్లో తగ్గని తీవ్రత

Siva Kodati |  
Published : Jul 07, 2021, 05:20 PM IST
ఏపీలో కొత్తగా 3,166 కరోనా కేసులు.. ఉభయ గోదావరి జిల్లాల్లో తగ్గని తీవ్రత

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిలకడగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3,166 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,08,336కి చేరుకుంది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిలకడగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 3,166 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,08,336కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 21 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 12,919కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి అనంతపురం 2,  తూర్పుగోదావరి 4, చిత్తూరు 4, గుంటూరు 2, కర్నూలు 2, కృష్ణ 3, విశాఖపట్నం 1, పశ్చిమగోదావరి 2, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున మరణించారు నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 3,748 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,63,061కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 83,885 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,26,08,072కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 32,356 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 102, చిత్తూరు 337, తూర్పుగోదావరి 664, గుంటూరు 239, కడప 221, కృష్ణ 191, కర్నూలు 45, నెల్లూరు 259, ప్రకాశం 375, శ్రీకాకుళం 103, విశాఖపట్నం 144 విజయనగరం 55, పశ్చిమ గోదావరిలలో 431 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

 

PREV
click me!

Recommended Stories

మార్కాపురం ప్రమాదంపై మంత్రుల ప్రెస్ మీట్ | Markapuram Bus Incident | Asianet News Telugu
అసెంబ్లీ లో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Powerful Speech in Assembly