పాలెగాళ్ల రాజ్యం, దాడి చేసి మాపైనే కేసులా: పవన్

By narsimha lodeFirst Published Jan 14, 2020, 5:16 PM IST
Highlights

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి  వాడిన భాషను జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. 

కాకినాడ: రెచ్చగొట్టి శాంతిభద్రతల  సమస్యలు సృష్టించాలనుకొంటే మీరు ఎవరూ కూడ ఆపలేరని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ అధికారంలోకి వస్తే పాలెగాళ్ల రాజ్యం, ఫాక్షన్ రాజ్యం వస్తోందని తాను ఎన్నికల సమయంలో చేసిన ప్రచారాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకొన్నారు. అదే తరహాలో వైసీపీ పాలన సాగుతోందని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు. 

కాకినాడలో బుధవారం నాడు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. పండగ వాతావరణ సమయంలో ఈ రకమైన ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు 

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడిన భాషను పవన్ కళ్యాణ్ తప్పుబట్టారు. ప్రజల సమస్యలపై పోరాటం చేసేందుకు తాము ముందుకు వెళ్తున్న సమయంలో తమపై అకారణంగా దాడులకు దిగారని పవన్ కళ్యాణ్ చెప్పారు. మీరే తిట్టి మాపై కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు.

పచ్చి బూతులు తిట్టారు కారణం లేకుండా తిట్టారని పవన్ కళ్యాణ్ చెప్పారు. పోలీసులు ఏం చేశారని పవన్ కళ్యాణ్  ప్రశ్నించారు.రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలపై మరో ఘటన జరిగితే చేతులు ముడుచుకొని కూర్చోమని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.

వైసీపీ నేతలు ఒళ్లంతా మదమెక్కి మాట్లాడారని పవన్ కళ్యాణ్ చెప్పారు. వైసీపీ నేతలు తమ మదాన్ని అణచుకోకపోతే ప్రజలే వారికి బుద్దిచెబుతారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఫ్యాక్షన్ సంస్కృతిని  వైసీపీ తీసుకురావాలనుకొంటే చూస్తూ ఊరుకోబోమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Also read:కాకినాడలో నానాజీని పరామర్శించిన పవన్ కళ్యాణ్

అధికారం శాశ్వతం కాదు, అధికారం ఎల్లవేళలా మీవైపే ఉండదని చెప్పారు.  అధికారం పోయిన తర్వాత ఎలా ఉంటుందో చూసుకోవాలన్నారు. కాకినాడ ఘటన విషయంలో పోలీసులు అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు.

Also read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు

కాకినాడ ఘటన విషయం కూడ కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉందని చెప్పారు. కాకినాడ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. 

వైసీపీ నేతలు పద్దతిని మార్చుకోకపోతే ప్రజలే బుద్దిచెబుతారని పవన్ కళ్యాణ్ చెప్పారు. దాడి చేసిన వారిపై కేసులు పెట్టాల్సిన పోలీసులు తమ పార్టీ కార్యకర్తలపైనే కేసులు పెట్టడడాన్ని పవన్ కళ్యాణ్ తీవ్రంగా తప్పుబట్టారు.

 గోదావరి జిల్లాల్లో ఇలాంటి ఘటనలు ఇలాంటివి ఏనాడూ జరగలేదన్నారు. ఈ తరహా ఘటనలు ఇదే చివరిది కావాల్సిన అవసరం ఉందన్నారు.
రాష్ట్రంలో ఉన్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పారు. 
 

click me!