గుడివాడలో సంక్రాంతి వేడుకలు: హాజరైన సీఎం జగన్

Siva Kodati |  
Published : Jan 14, 2020, 04:13 PM ISTUpdated : Jan 14, 2020, 05:13 PM IST
గుడివాడలో సంక్రాంతి వేడుకలు: హాజరైన సీఎం జగన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడివాడలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో జరుగుతున్న బండ్ల లాగుడు పోటీల్లో ఆయన పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడివాడలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో జరుగుతున్న బండ్ల లాగుడు పోటీల్లో ఆయన పాల్గొన్నారు.

Also Read:ఎస్పీ చెప్పిన కొద్దిక్షణాల్లోనే పవన్‌ను అడ్డుకొన్న పోలీసులు

తాడేపల్లి నుంచి గుడివాడ చేరుకున్న ఆయనకు మంత్రి నాని, అధికారులు, ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్రస్థాయి ఎండ్ల బండ్ల పోటీలను సీఎం ప్రారంభించారు.

 ఈ సందర్భంగా నానితో కలిసి జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు, పొట్టేళ్ల పందేలాను సీఎం తిలకించారు. అంతకుముందు ఆయన చిన్నారులపై భోగి పళ్లు వేసి ఆశీర్వదించారు.  అంతకుముందు ఆయన రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read:రంగంలోకి నందమూరి సుహాసిని: అమరావతిపై వ్యాఖ్యలు ఇవీ...

రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’అని జగన్ ట్వీట్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం