వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని చూస్తోందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్
వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలని చూస్తోందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మంగళవారం రాజధాని తరలింపును తరలించడాన్ని నిరసిస్తూ యర్రబాలెం, మందడం, తుళ్లూరు గ్రామాల్లో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు కన్నీరు పెడితే అది రాష్ట్రానికి మంచిది కాదని.. రాష్ట్ర భవిష్యత్ కోసమే రైతులు భూములిచ్చారని పవన్ గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలు సృష్టించాలని చూస్తున్నారని.. అమరావతికి తాము అనుకూలమే అని జగన్ అసెంబ్లీలో చెప్పిన సంగతిని పవన్ గుర్తుచేశారు.
undefined
Also Read:వైఎస్ జగన్ మూడు రాజధానులు: విశాఖ ఏ మేరకు సేఫ్ ?
ఆరోజే అమరావతి ఒక కులానికి, మతానికి, వర్గానికి చేస్తున్నారని జగన్ చెప్పి ఉండాల్సిందని జనసేనాని మండిపడ్డారు. అందరూ అంగీకరించిన తర్వాత ఇప్పుడు అమరావతి పై బురద చల్లుతున్నారని.. ఒక్క చాన్స్ ఒక్క చాన్స్ అంటూ అమరావతి ఆశను చంపేస్తున్నారని పవన్ మండిపడ్డారు.
అమరావతిపై అర్ధం లేని ఆరోపణలు చేస్తున్నారని.. పోలీసులు తనను అడుగడుగునా ఆపుతున్నారని ధ్వజమెత్తారు. ప్రజా ప్రతినిధులు చేపుతున్నారని పోలీసులు అపుతున్నారు....వారి పదవి శాశ్వతం కాదని పోలీసులు గుర్తించుకోవాలని పవన్ హితవు పలికారు.
అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్లి రైతులను ఇబ్బందులు పెడుతున్నారని.. రైతులు సూట్ కేస్ కంపెనీలు పెట్టి జైలుకు వెళ్లిన వారు కాదని, వారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని దుయ్యబట్టారు.
Also Read:నేను పోలీసు కొడుకునే: పోలీసులపై పవన్ ఫైర్
బలవంతపు భూ సేకరణ చేయవద్దని అప్పటి టీడీపీ ప్రభుత్వానికి చెప్పానని పవన్ గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వం డబ్బులైతే ఖర్చు చేశారు కానీ అమరావతిలో ఎంత నిర్మాణం జరిగిందో ప్రజలకు చెప్పడంలో మాత్రం విఫలం చెందిందని ఆయన అభిప్రాయపడ్డారు.
పోలవరానికి ఎక్కువ ప్రచారం ఇచ్చారు కానీ అమరావతిని మర్చిపోయారని పవన్ చురకలంటించారు. రాష్ట్ర సంక్షేమం కోసం రైతులు త్యాగాలు చేసి 33 వేల ఎకరాలు ఇచ్చారని.. వారికి జనసేన అండగా ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు.