కాపుల్ని జగన్ లైట్ తీసుకున్నారు .. ఈసారి ఓట్లు చీలనివ్వను, అవసరమైతే బీజేపీని ఒప్పిస్తా : పొత్తులపై పవన్

Siva Kodati |  
Published : May 20, 2022, 09:56 PM ISTUpdated : May 20, 2022, 10:06 PM IST
కాపుల్ని జగన్ లైట్ తీసుకున్నారు .. ఈసారి ఓట్లు చీలనివ్వను, అవసరమైతే బీజేపీని ఒప్పిస్తా : పొత్తులపై పవన్

సారాంశం

2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఓట్లు మాత్రం చీలనివ్వనని.. అవసరమైతే బీజేపీ అధిష్టానాన్ని ఒప్పిస్తానని ఆయన స్పష్టం చేశారు.   

ఆంధ్రప్రదేశ్‌లో (ap election 2024) గత కొన్ని రోజులుగా పొత్తులపై (alliance politics) జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో జనసేన (janasena) అధినేత పవన్ కళ్యాణ్ (pawan kalyan) మరింత క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో ప్రతినిధులతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వకుండా ఉండేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని పవన్ స్పష్టం చేశారు. రాజధాని విషయంలో బీజేపీ అధినాయకత్వాన్ని ఒప్పించినట్లే ... ఓట్ల చీలిక విషయంలోనూ బీజేపీ (bjp) హైకమాండ్‌ను ఒప్పించే ప్రయత్నం చేస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

20 శాతం వున్న కాపుల ఓట్లను చాలా తేలిగ్గా చీల్చగలమని వైసీపీ భావిస్తోందని.. కాపు సామాజిక వర్గం ఓటర్లు తమను రాజకీయంగా ఏం చేయలేరనే భావనలో వైసీపీ వుందని ఆయన ఎద్దేవా చేశారు. కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ చాలా లైట్ తీసుకుందని.. అందుకే రిజర్వేషన్లు ఇవ్వలేమని జగన్ చెప్పారని పవన్ ఎద్దేవా చేశారు. 

ALso Read:హైదరాబాద్‌లో త్వరలో జనసేన కార్యాలయం.. తెలంగాణలోనూ తిరుగుతా : పవన్ కల్యాణ్

రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే ఓట్లను చీలనివ్వకూడదనే నిర్ణయం తీసుకున్నానని ఆయన చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కన్నా తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు. ప్రజలకు దగ్గరయ్యే విధంగా తన యాత్ర వుంటుందని.. ఇప్పటికే అప్పు పుట్టని పరిస్ధితిలోకి రాష్ట్రాన్ని తీసుకెళ్లారని పవన్ మండిపడ్డారు. ఏపీ ఆర్ధిక పరిస్ధితిపై కేంద్రానికి పూర్తి అవగాహన వుందన్నారు. తెలంగాణలో 30 స్థానాల్లో (telangana election 2023) పోటీ చేసే బలం జనసేనకు వుందని పవన్ తెలిపారు. తెలంగాణలో 15 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ఇప్పుడే ఏం చెప్పలేమని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. 

అటు వైసీపీ , జగన్ ప్రభుత్వంపైనా (ys jagan govt) జనసేన అధినేత మండిపడ్డారు. రాష్ట్రం బలంగా వుంటే జనసేన బలంగా వున్నట్లేనని.. ఎక్కడ పోటీ చేసినా తనను ఓడిస్తామన్న వైసీపీ నేతల ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని పవన్ తెలిపారు. ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలవుతాయని, తనను విమర్శించిన మాజీ మంత్రులకు ఇప్పటికైనా తెలిసుండాలని ఆయన చురకలు వేశారు. తనను తిడితే పదవి కలకాలం నిలవదని వైసీపీ నేతలు గ్రహించే వుంటారని పవన్ దుయ్యబట్టారు. సీపీఎస్ విధానానికి చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని.. లక్షల  కోట్లు విదేశాలకు తరలించే తెలివి తేటలున్నప్పుడు, సీపీఎస్ సమస్యను పరిష్కరించే తెలివితేటలు వుండవా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఓట్లు చీలనివ్వమన్న చిన్న పదానికి వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారంటూ సెటైర్లు వేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Perni Nani comments on Chandrababu: చంద్రబాబు, పవన్ పేర్ని నాని సెటైర్లు | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే