మీకు కోపం ఉంటే వేరేలా తీర్చుకోండి, వ్యంగ్యంగా మాట్లాడొద్దు: మంత్రి బొత్సకు పవన్ హెచ్చరిక

By Nagaraju penumalaFirst Published Oct 25, 2019, 2:06 PM IST
Highlights

రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికీ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. బొత్స సత్యనారాయణకు టీడీపీపై కోపం ఉంటే వేరేలా తీర్చుకోవాలే తప్ప ప్రజలపై కాదని హెచ్చరించారు జనసేనాని పవన్ కళ్యాణ్. 

అమరావతి: ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికీ వ్యంగ్యంగా మాట్లాడటం పద్ధతి కాదని సూచించారు. 

వైసీపీ ప్రభుత్వం పది ఉద్యోగాలు కల్పించడానికి 10వేల మంది ఉపాధి తీసేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తరలింపుపై కూడా  రాయలసీమ నుంచి లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందేనన్నారు. 

ఇప్పటి వరకు రాయలసీమ నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో పోరాటం చేసి ఉంటే, సరైన నిర్ణయాలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.  

హైకోర్టు ఎక్కడ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఏపీ ప్రజల్లో నెలకొందని పవన్ ఆరోపించారు. అసలు రాజధాని ఉందో లేదో కూడా తెలియని పరిస్థితిని రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. 

రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికీ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. బొత్స సత్యనారాయణకు టీడీపీపై కోపం ఉంటే వేరేలా తీర్చుకోవాలే తప్ప ప్రజలపై కాదని హెచ్చరించారు జనసేనాని పవన్ కళ్యాణ్. 

ప్రజల రాజధానిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మంచి పద్ధతి కాదన్నారు. రాజధానిపై ప్రజలను గందరగోళానికి గురిచేసేలా బొత్స సత్యనారాయణ ప్రవర్తించ వద్దని హితవు పలికారు పవన్ కళ్యాణ్. 

రాజధాని నిర్మిస్తారా లేదా , హైకోర్టును రాయలసీమకు తరలిస్తారా లేదా అనే దానిపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ చాలా విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు.  

వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయన్నారు. లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. ఇసుక కొరతపై ఈనెల 3న విశాఖపట్నంలో ర్యాలీ చేపట్టనున్నామని అందుకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకాలని కోరారు.  

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వమైనా మంచి పాలన అందించాలని తాముకోరుకున్నట్లు తెలిపారు. కానీ తాము అనుకున్నదానికి రివర్స్ గా ఉందన్నారు.  ప్రభుత్వం అవకతవకలకు పాల్పడటంతో రోడ్డెక్కాల్సిన పరిస్తితి వచ్చిందన్నారు. చట్టాలను గౌరవించాల్సింది పోయి చట్టాలను తుంగలో తొక్కుతున్నారంటూ మండిపడ్డారు.

టీడీపీ హయాంలో జరిగిన ఇసుకమాఫియా ఇప్పుడూ జరుగుతుందని చెప్పుకొచ్చారు. అప్పుడు టీడీపీ వాళు చేస్తే ఇప్పుడు వైసీపీ వాళ్లు చేస్తున్నారని అంతే తప్ప ఏమీ మార్పులేదన్నారు. ఒంగోలు నుంచి లారీలతో వచ్చి మరీ ఇసుకమాఫియా చేస్తున్నారంటూ మండిపడ్డారు. లారీలు వెనకో రెండు బైకులు, ముందో రెండు బైకులు, లారీ యజమాని కారులో ఇలా వస్తూ అందర్నీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. 

ఇసు రాష్ట్రంలో ఉండి కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇసుక ఇక్కడే ఆగిపోయిందని కానీ ఏపీ ఇసుక మాత్రం హైదరాబాద్ కు అనంతపురం నుంచి బెంగళూరుకు తరలిపోతుందని చెప్పుకొచ్చారు.  

రైతు పొలంమీద ఆధారపడి ఎలా బతుకుతారో అలాగే లారీలు మీద ఆధారపడే వారికి భవిష్యత్ పై భరోసా కల్పించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అర్థరాత్రి దొంగల్లా ఆన్ లైన్లో ఇసుక బుక్ చేసుకోవడం ఏంటన్నారు. 

అర్థరాత్రి ఆన్ లైన్ లో ఇసుక బుక్ చేసుకోవాలంటూ వైసీపీ వాళ్లకు సమాచారం ఇవ్వడంతో వారు ఒక్క ఐదు నిమిషాల్లో ఆన్ లైన్లో బుక్ చేసుకుంటున్నారని ఆ తర్వాత సర్వర్ డౌన్ అంటుందని ఇది కూడా మాఫియానేనని చెప్పుకొచ్చారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ప్రధానికి ఫిర్యాదు చేస్తా: జగన్ కు పవన్ కళ్యాణ్ వార్నింగ్...

సీబీఐ కేసులున్న జగన్ కేంద్రంతో..... పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

click me!