ఢిల్లీలోనే పవన్.. ఏపీ బీజేపీ ఇంచార్జ్ మురళీధరన్‌తో కీలక సమావేశం..!!

Published : Jul 19, 2023, 01:16 PM IST
ఢిల్లీలోనే  పవన్.. ఏపీ బీజేపీ ఇంచార్జ్ మురళీధరన్‌తో కీలక సమావేశం..!!

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న పవన్ కల్యాణ్.. ఈరోజు ఉదయం ఏపీ బీజేపీ ఇంచార్జ్, కేంద్ర మంత్రి వి మురళీధరన్‌తో సమావేశమయ్యారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంగళవారం సాయంత్రం ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న పవన్ కల్యాణ్.. ఈరోజు ఉదయం ఏపీ బీజేపీ ఇంచార్జ్, కేంద్ర మంత్రి వి మురళీధరన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్టుగా తెలుస్తోంది. పవన్‌తో భేటీకి సంబంధించిన ఫొటోలను షేర్  చేసిన మురళీధరన్‌.. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన కూటమిని మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించినట్టుగా చెప్పారు. అయితే ఈ సమావేశంలో రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకు వెళ్లడంపై కూడా నేతలు సమాలోచనలు జరిపినట్టుగా తెలుస్తోంది. 

ఇదిలా ఉంటే.. మంగళవారం ఏన్డీయే సమావేశంలో పాల్గొన్న అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ రాజకీయ పరిస్థితుల గురించే ప్రధానంగా చర్చ జరిగిందని చెప్పారు. ఏపీ రాజకీయాలపై చర్చ జరగలేదని అన్నారు.  ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం మరింత పటిష్టంగా మారిందని అన్నారు. ఎన్డీయే పక్షాల సమావేశంలో భవిష్యత్తులో ఏ విధంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించినట్టుగా తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్త పార్టీ ఎన్డీయే కూటమిలో చేరే అవకాశాలు ఉన్నాయా? అని మీడియా ప్రశ్నించగా.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చని సమాధానం ఇచ్చారు. 

ఇక, ఢిల్లీలో పవన్ మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం ఆర్థికంగా చితికిపోతోందన్నారు. రాష్ట్రానికి సుస్థిరత కల్పించడమే తన లక్ష్యమనీ, అందుకోసం 2014లో ఎన్డీయేలోని మూడు మిత్రపక్షాలైన బీజేపీ, టీడీపీ, జనసేనలు మళ్లీ ఒక్కటవ్వాలని ఆశిస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలిపారు.ఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో పవన్ స్పందిస్తూ.. అది సమస్య కాదనీ, జనసేన క్యాడర్ తనను సీఎంగా చూడాలని కోరుకుంటోందని అన్నారు. క్షేత్ర స్థాయిలో బలాబలాల ఆధారంగా సీఎం అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. వైసీపీని ఓడించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని పవన్ స్పష్టం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu