సీజ్ చేసి రిలీజ్ చేశారు.. మళ్లీ సీజ్ చేశారు: ఆర్టీఏ అధికారులపై జేసీ సీరియస్

By Siva Kodati  |  First Published Dec 31, 2019, 3:09 PM IST

టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. 


టీడీపీ సీనియర్ నేత, అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి చెందిన దివాకర్ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు కొరడా ఝళిపించారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడపుతున్నారంటూ జిల్లా వ్యాప్తంగా ఆరు బస్సులను అనంతపురం ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు.

Also Read:అమరావతికి జై కొట్టిన గంటా, పార్టీ మార్పుపై స్పష్టత

Latest Videos

undefined

అయితే గతంలో కూడా దివాకర్ ట్రావెల్స్ బస్సులను అధికారులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన జేసీ.. తమ బస్సులను అధికారులు అక్రమంగా సీజ్ చేశారంటూ అప్పట్లో హైకోర్టను ఆశ్రయించారు.

దీనిపై విచారించిన ధర్మాసనం.. సీజ్ చేసిన ట్రావెల్స్ బస్సులను రిలీజ్ చేయాలంటూ ఉన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది. కోర్టు తీర్పు మేరకు మూడు రోజుల క్రితమే సదరు బస్సులను అధికారులు రిలీజ్ చేశారు.

Also Read:జగన్ సర్కార్ ఎప్పుడైనా కూలిపోవచ్చు: పవన్

ఈ బస్సులనే తిరిగి మరోసారి ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.. దీనిపై దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కక్షసాధింపుతోనే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్నారు. 

click me!