ఏపీ రాష్ట్రంలో రెండేళ్లలో వందకు పైగా ఆలయాలపై దాడులు జరిగినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు.
అమరావతి: ఏపీ రాష్ట్రంలో రెండేళ్లలో వందకు పైగా ఆలయాలపై దాడులు జరిగినా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టుగా వ్యవహరిస్తోందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శించారు.
బుధవారం నాడు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని ఆలయాలపై జరుగుతున్న దాడులపై ఆయన మండిపడ్డారు. గెరిల్లా వార్ ఫేర్ అంటూ జగన్ బాధ్యత నుండి తప్పించుకొంటున్నారని ఆయన మండిపడ్డారు.
undefined
also read:రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్‌ఫేర్:జగన్ సంచలనం
విగ్రహాల ధ్వంసంపై పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. దేవాలయాలపై దాడుల ఘటనతో పీఠాధిపతులు సైతం రోడ్డున పడాల్సి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మొదటి ఘటన జరిగిన సమయంలోనే ప్రభుత్వం సరిగా వ్యవహరిస్తే వరుస ఘటనలు చోటు చేసుకొనేవి కావని ఆయన అభిప్రాయపడ్డారు. ఇకనైనా ప్రభుత్వం ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్రంలో వరుసగా దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.ఈ దాడుల ఘటనను నిరసిస్తూ రాష్ట్రంలో విపక్షాలు ఆందోళనలు సాగుతున్నాయి. రామతీర్థం ఘటన రాష్ట్రంలో రాజకీయాన్ని మరింత వేడిని పుట్టించింది. ఈ ఘటనలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపీ సీఎం జగన్ మంగళవారం నాడు ఎస్పీలను ఆదేశించారు.