నిండా మునిగా చలేంటీ.. గోదావరి జిల్లాల్లో వైసీపీతో సై అంటే సై, చూసుకుందాం : జగన్‌కు పవన్ సవాల్

Siva Kodati |  
Published : Jun 30, 2023, 08:14 PM IST
నిండా మునిగా చలేంటీ.. గోదావరి జిల్లాల్లో వైసీపీతో సై అంటే సై, చూసుకుందాం : జగన్‌కు పవన్ సవాల్

సారాంశం

వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో వైసీపీతో సై అంటే సై అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తనను గెలిపించి ఆశీర్వదించాలని పవన్ కల్యాణ్ ప్రజలను కోరారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వారాహి విజయ యాత్రలో భాగంగా శుక్రవారం భీమవరంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో వైసీపీతో సై అంటే సై అన్నారు . తాను నిండా మునిగిపోయానని.. ఇక చలేంటీ అంటూ పవన్ వ్యాఖ్యానించారు. తనను గెలిపించి ఆశీర్వదించాలని పవన్ కల్యాణ్ ప్రజలను కోరారు. జగన్ వస్తే చెట్లను కూడా కొట్టేస్తున్నారని పవన్ చురకలంటించారు. రాష్ట్ర సమస్యలపై దశాబ్ధ కాలంగా పోరాటం చేస్తున్నామని ఆయన తెలిపారు. 

భీమవరంలో ఓడిపోయినా తాను పట్టించుకోలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. వైసీపీ పాలనలో చెట్లు కూడా మౌనపోరాటం చేస్తున్నాయని జనసేనాని పేర్కొన్నారు. మద్య నిషేధం అంటూనే విక్రయాలు పెంచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. రెండున్నర లక్షల ఉద్యోగాల హామీపై సీఎం స్పందన లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు నాశనం చేశారని.. వాలంటీర్ ఉద్యోగాల పేరుతో యువతను రూ.5 వేలకు పరిమితం చేశారని పవన్ దుయ్యబట్టారు. దోపిడీ వ్యవస్థకు ఎదురొడ్డి నిలబడ్డామని.. యువజనులు, శ్రామికులు, రైతులకు ఏం చేశారని జనసేనాని ప్రశ్నించారు. 

ALso Read: జనసేనలోకి ప్రముఖ లాయర్.. వచ్చే ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో వైసీపీ గెలవొద్దు : పవన్ కల్యాణ్

ఒక ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్‌ను చంపేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేస్తే ఎవరికి పట్టదన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు, 30 మంది ఎంపీలున్న వ్యవస్థతో మనం పోరాడుతున్నామని పవన్ తెలిపారు. డబ్బులు మనవి, సోకు ఈ ముఖ్యమంత్రిదన్నారు. తన అక్కను ఏడిపిస్తున్నారని 15 ఏళ్ల పిల్లాడు తిరగబడితే కాల్చి తగలబెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బ్రెయిన్ డ్రెయిన్ ఎందుకు జరుగుతోందని పవన్ ప్రశ్నించారు. మార్పు కోసం, ఎక్కడికి పారిపోకుండా పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. 

యువత కోసం వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రతిభ, నైపుణ్యానికి తగిన పారితోషికం ఇస్తున్నారా అని ఆయన నిలదీశారు. సరైన రాజకీయ వ్యవస్థ లేకపోతే ప్రతిభ విదేశాలకు వలస వెళ్లిపోతుందన్నారు. యువతలో ప్రతిభను వెలికితీసే పాలసీలు ఏమైనా తెచ్చారా అని వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. భీమవరం నుంచి ఎందరో విదేశాలకు వెళ్లి రాణించారని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. విదేశీ విద్య పథకానికి అంబేద్కర్ పేరు వుండాలని.. ఎస్సీ, బీసీ కులాలకు చెందిన ఎందరిని ప్రోత్సహించారని ప్రశ్నించారు. ఐటీ ఇంజనీరింగ్ నిపుణులు ఇక్కడే ఎక్కువమంది వున్నారని పవన్ తెలిపారు. కులాల పరిధి దాటి ఆలోచించాలని నాయకులను కోరుతున్నానని చెప్పారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్