పార్లమెంట్, అసెంబ్లీలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన పవన్

Siva Kodati |  
Published : Jan 06, 2020, 09:45 PM IST
పార్లమెంట్, అసెంబ్లీలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన పవన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల పరిధిలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని 35 అసెంబ్లీ, 6 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని నాలుగు జిల్లాల పరిధిలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖ, తూర్పుగోదావరి, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని 35 అసెంబ్లీ, 6 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించారు.

దీనితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని పవన్ ఏర్పాటు చేశారు. వీరు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేస్తారు. 

కమిటీ సభ్యులు:
* టీ.శంకర్
* మేడా గురుదత్
* సుజాత పండా
* బొమ్మిడి నాయకర్
* వై శ్రీనివాస్‌

పార్లమెంటరీ ఇన్‌ఛార్జులు:

విశాఖ పార్లమెంట్- వీవీ లక్ష్మీనారాయణ
అరకు- పి. గంగులయ్య
కాకినాడ- పంతం నానాజీ
అమలాపురం- డీఎంఆర్‌ శేఖర్
రాజమహేంద్రవరం- కందుల దుర్గేశ్
గుంటూరు- బోనబోయిన శ్రీనివాస్ యాదవ్

జనసేన శానససభ్యుడు రాపాక వరప్రసాద్ మరోసారి తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఝలక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు. వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను ఆయన మరోసారి సమర్థించారు. 

Also Read:మరోసారి పవన్ కల్యాణ్ కు ఝలక్: జగన్ కు జైకొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

శనివారం ఉదయం రాపాక వరప్రసాద్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మూడు రాజధానుల నిర్ణయం సరైందేనని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాదును మాత్రమే అభివృద్ధి చేశారని, నిధులను అక్కడే ఖర్చు చేసి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని ఆయన అన్నారు. 

నవరత్నాల వంటి కార్యక్రమాలతో వైఎస్ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని ఆయన చెప్పారు. మంచి చేస్తే మద్దతు ఇస్తామని, చెడు చేస్తే వ్యతిరేకిస్తామని ఆయన అన్నారు మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read:ఇన్‌సైడ్ ట్రేడింగ్‌: లేటు ఎందుకు చర్యలు తీసుకోండి.. వైసీపీపై పవన్ ఫైర్

గత ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుందని ఆయన ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రభుత్వ నిర్ణయం రైతులకు ఇబ్బంది కలిగిస్తుందని అంటూనే అమరావతి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. 

వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దానిపై ఆయన నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Birthday: సీఎం చంద్రబాబుకి నారా భువనేశ్వరి పుట్టినరోజు కానుక | Asianet Telugu
Goa Governor Ashok Gajapathi Raju Performs Sacred Rituals in Visakhapatnam | Asianet News Telugu