మోడీతో మోహన్ బాబు భేటీ: రాజకీయాల కోసం కాదు.. మరెందుకంటే..!!

Published : Jan 06, 2020, 07:03 PM ISTUpdated : Jan 08, 2020, 05:43 PM IST
మోడీతో మోహన్ బాబు భేటీ: రాజకీయాల కోసం కాదు.. మరెందుకంటే..!!

సారాంశం

తమ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదన్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఢిల్లీలో సోమవారం ప్రధాని నరేంద్రమోడీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో ఉన్న తమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించేందుకే తాము నరేంద్రమోడీని కలిసినట్లు కలెక్షన్ కింగ్ పేర్కొన్నారు. 

తమ మధ్య రాజకీయాల ప్రస్తావన రాలేదన్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. ఢిల్లీలో సోమవారం ప్రధాని నరేంద్రమోడీని కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుపతిలో ఉన్న తమ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి ఆహ్వానించేందుకే తాము నరేంద్రమోడీని కలిసినట్లు కలెక్షన్ కింగ్ పేర్కొన్నారు. 

మంచు విష్ణు మాట్లాడుతూ... చిత్ర పరిశ్రమకు సంబంధించి నార్త్, సౌత్ అనే భేదం ప్రధానికి లేదన్నారు. అప్పడు బాలీవుడ్ ప్రముఖులతో కలిసే అవకాశం ఉంది కాబట్టే వారిని కలిశామని, త్వరలోనే దక్షిణాది చిత్రపరిశ్రమకు సంబంధించిన వారిని కూడా కలుస్తానని మోడీ చెప్పారని విష్ణు వెల్లడించారు. 

ప్రధానమంత్రి మోడీతో సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం సోమవారం నాడు భేటీ అయింది. బీజేపీలో చేరాలని మోహన్ బాబు కుటుంబాన్ని ప్రధానమంత్రి మోడీ ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. సుమారు 15 నిమిషాల పాటు మోడీతో మోహన్ బాబు కుటుంబం సమావేశమైంది. 

Also Read:మోడీతో భేటీ: బీజేపీలోకి మోహన్ బాబు కుటుంబం

2019 మార్చి 26వ తేదీన మోహన్ బాబు వైసీపీలో చేరారు. అంతకుముందు ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ గురించి చిత్తూరు జిల్లాలోని తన విద్యా సంస్థల విద్యార్థులతో మోహన్ బాబు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సమయంలో  ఏపీ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది.

2019 ఏప్రిల్ మాసంలో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో  మోహన్ బాబు వైసీపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ప్రస్తుతం మోహన్ బాబు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో బేటీ కావడం రాజకీయంగా కలకలం రేపుతోంది.

నరేంద్రమోడీతో మోహన్ బాబుతో పాటు  ఆయన కూతురు మంచు లక్ష్మి కూడ ఉన్నారు. 15 నిమిషాల పాటు మోడీతో మోహన్ బాబు బేటీ అయ్యారు. దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్టుగా సమాచారం. 

బీజేపీలో చేరాలని మోహన్ బాబును మోడీ  ఆహ్వానించినట్టుగా సమాచారం.. బీజేపీలో మోహన్ బాబు కుటుంబం చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ విషయమై మోహన్ బాబు కుటుంబం నుండి స్పష్టత రావాల్సి ఉంది.

మోహన్ బాబు ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితుడుగా మోహన్ బాబు ఆ సమయంలో కొనసాగారు. టీడీపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఆ తర్వాత టీడీపీకి దూరమయ్యారు.

Also Read:మంచు విష్ణు ప్రపోజల్ కు నరేంద్ర మోడీ ఓకే.. గుడ్ న్యూస్ ఇదే!

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోహన్ బాబు తనయుడు విష్ణుకు వైఎస్ఆర్ సమీప బంధువు కుటుంబం నుండి అమ్మాయిని కోడలుగా తెచ్చుకొన్నాడు.  ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఆయన సన్నిహితంగా కొనసాగారు. 

వైఎస్ జగన్‌ వైసీపీని ఏర్పాటు చేసిన తర్వాత గత ఏడాది ఎన్నికల సమయంలోనే మోహన్ బాబు వైసీపీలో చేరారు. ఇవాళ  మోడీతో మోహన్ బాబు కుటుంబం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది. 2014 ఎన్నికల సమయంలో కూడ మోహన్ బాబు నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu Birthday: సీఎం చంద్రబాబుకి నారా భువనేశ్వరి పుట్టినరోజు కానుక | Asianet Telugu
Goa Governor Ashok Gajapathi Raju Performs Sacred Rituals in Visakhapatnam | Asianet News Telugu