గల్లా! ఏమిటీ సిల్లీ కథ!! బ్యాటరీ డౌన్: జగన్, పవన్ సినిమాకు జనసేన కౌంటర్

Published : Apr 27, 2018, 09:21 PM IST
గల్లా! ఏమిటీ సిల్లీ కథ!! బ్యాటరీ డౌన్: జగన్, పవన్ సినిమాకు జనసేన కౌంటర్

సారాంశం

తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ట్విట్టర్ వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కౌంటర్ ఇచ్చింది.

అమరావతి: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ట్విట్టర్ వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కౌంటర్ ఇచ్చింది. "వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచులా ఒక్కసారి లోకసభలో స్పెషల్ స్టేటస్ పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారూ.. మీ మౌనం వెనక కారణం ఏమిటో రెండు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలుసు సార్.." అని వ్యాఖ్యానించింది.

"కౌత్త సినిమా. కథ - డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి... స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్తా ఆలోచించండి మాస్టారు.." అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జనసేన ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.

రెండు రోజుల క్రితం గల్లా జయదేవ్ తన ట్విటర్ పేజీలో చేసిన వ్యాఖ్యకు సమాధానంగా జనసేన ఆ ప్రెస్ నోట్ విడుదల చేసింది. "కొత్త సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. జగన్ పవన్ టైటిల్ తో. రాబోతున్న ఈ చిత్రానికి కథ - దర్శకత్వం ప్రశాంత్ కిశోర్ అయితే మోడీ - షా ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ చిత్రం విడుదల అవుతుందని ఆయన అన్నారు. 

PREV
click me!

Recommended Stories

Chandrababu NaiduL: క్వాంటం టెక్నాలజీపై చంద్రబాబు అదిరిపోయే స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Naidu: టెక్ విద్యార్థులతో చంద్రబాబు ‘క్వాంటమ్ టాక్’ | Asianet News Telugu