పవన్ ఫ్యాన్స్ అరాచకం.. మూల్యం చెల్లిస్తామంటున్న జనసేన

Published : Feb 26, 2019, 12:24 PM IST
పవన్ ఫ్యాన్స్ అరాచకం.. మూల్యం చెల్లిస్తామంటున్న జనసేన

సారాంశం

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ఆయన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 

జనసేన అధినేత, సినీనటుడు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ఆయన అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు వారి అత్యుత్సాహానికి మూల్యం జనసేన పార్టీ చెల్లించాల్సి వస్తోంది.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... ఆదివారం పవన్ కర్నూలులో బహిరంగ సభ నిర్వహించారు. కాగా..  ఈసభకు వచ్చిన ఆయన అభిమానులు కర్నూలు చారిత్రక కట్టడం కొండారెడ్డి ఖిల్లాని ధ్వంసం చేశారు. దాదాపు వేయి మంది కొండా రెడ్డి ఖిల్లాలోకి చొరబడ్డారు. జనసేన జెండాలను ప్రదర్శిస్తూ గోడల మీదికి ఎక్కారు. బారికేడ్లను తన్నేశారు.

ఈ సంఘటనలో దాదాపు 200 పూలకుండీలు నాశనమయ్యాయి. స్టీల్ రెయిలింగ్స్ వంగిపోయాయి. మెట్లు, బెంచీలు ధ్వంసమయ్యాయి. దాదాపు లక్ష రూపాయల మేరకు నష్టం వాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా.. ఈ నష్టానికి జరిగిన పరిహారాన్ని తాము చెల్లిస్తామంటూ జనసేన పార్టీ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

కొండారెడ్డి ఖిల్లాని ధ్వంసం చేసినందుకు గాను.. పోలీస్ స్టేషన్ లో కేసు నమోదవ్వగా.. దానిని ఇప్పుడు కొట్టివేసినట్లు సమాచారం. డ్యామేజ్ కి ఎంత అయినా.. చెల్లిస్తామని జనసేన ఆఫర్ చేసిందట. అందుకే కేసు కొట్టేసి.. పార్టీ ఆఫర్ ని సంబంధిత అధికారులు అంగీకరించినట్లు తెలుస్తోంది. 

related news

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అరాచకం: కొండారెడ్డి ఖిల్లా విధ్వంసం

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu